‘అబ్బా జాన్’ వివాదాన్ని మరోసారి లేవనెత్తిన యోగి

ABN , First Publish Date - 2021-11-23T22:59:46+05:30 IST

ఈ వివాదం కనుమరుగైంది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆ వ్యాఖ్యలు చేసి మాసిపోతున్న వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చారు. మంగళవారం కాన్పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘‘కొంత మంది సీఏఏను అడ్డం పెట్టుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అలాంటి ‘అబ్బా జాన్’..

‘అబ్బా జాన్’ వివాదాన్ని మరోసారి లేవనెత్తిన యోగి

లఖ్‌నవూ: ‘అబ్బా జాన్’ అని మాట్లాడేవారందరూ 2017కి ముందు రేషన్ సరుకుల్ని మింగేశారంటూ కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. పరోక్షంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని యోగి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష నేతలు సహా నెటిజెన్లు యోగిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందనేదానికి ఇదే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు.


కాగా, ఈ వివాదం కనుమరుగైంది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆ వ్యాఖ్యలు చేసి మాసిపోతున్న వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చారు. మంగళవారం కాన్పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘‘కొంత మంది సీఏఏను అడ్డం పెట్టుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అలాంటి ‘అబ్బా జాన్’, ‘చాచా జాన్‌’లను నేను హెచ్చరిస్తున్నాను. ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వానికి తెలుసు’’ అని అన్నారు. మరోసారి అబ్బా జాన్ అనడమే కాకుండా దానికి అనుబంధంగా చాచా జాన్ అనే పదాన్ని కూడా యోగి చేర్చి మరింత వివాదానికి తెరతీస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2021-11-23T22:59:46+05:30 IST