BJP: యోగియే సీఎం అభ్యర్థి

ABN , First Publish Date - 2021-08-06T16:30:03+05:30 IST

వచ్చే ఎన్నికల్లోనూ యోగియే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. 2017 నుంచి యోగి నేతృత్వం

BJP: యోగియే సీఎం అభ్యర్థి

లక్నో : వచ్చే ఎన్నికల్లోనూ యోగియే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ప్రకటించారు. 2017 నుంచి యోగి నేతృత్వంలో రాష్ట్రం అద్భుతంగా పనిచేస్తోందని, విపక్షాలకు పనిలేకుండా పోయిందన్నారు. యోగి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ‘‘2017 నుంచి యోగి అద్భుతంగా పనిచేస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది. యోగి సమర్థమంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థి’’ అని కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు. 

Updated Date - 2021-08-06T16:30:03+05:30 IST