Abn logo
Sep 19 2020 @ 11:33AM

నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం

Kaakateeya

యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ యోచన

నోయిడా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధనగర్ జిల్లా నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని సీఎం అధికారులను కోరారు. గౌతంబుద్ధనగర్, మీరట్, ఘజియాబాద్, బులంద్ షహర్, హాపూర్, బాగ్ పత్ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం యోగి అధికారులతో సమీక్షించారు. యూపీ సీనియర్ అధికారులు, కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, యూపీ ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గార్గ్, ప్రజాప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్సులో సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. 

గౌతమబుద్ధ నగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్లు సీఎం యోగి ప్రకటించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో స్థలాన్ని చూసి ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.మీరట్ మెట్రో ప్రాజెక్టును 2025 మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం కోరారు. 

Advertisement
Advertisement
Advertisement