Uttar Pradeshలో సమ్మెలపై నిషేధం..సీఎం యోగి ఎస్మా చట్టం ప్రయోగం

ABN , First Publish Date - 2021-12-20T13:19:44+05:30 IST

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించింది....

Uttar Pradeshలో సమ్మెలపై నిషేధం..సీఎం యోగి ఎస్మా చట్టం ప్రయోగం

లక్నో : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించింది.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు.ప్రస్తుతం ఉన్న కొవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవేష్ కుమార్ చతుర్వేది నోటిఫికేషన్ జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కార్పొరేషన్లు, స్థానిక అధికారులు సమ్మెలు చేయరాదు. సమ్మె నిషేధ ఉత్తర్వులను ధిక్కరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్‌లో యూపీ సర్కారు హెచ్చరించింది.అంతకుముందు మేలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్,ఎస్మాను అమలు చేయడం ద్వారా ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించింది.


 కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.సమ్మెలో ఉన్న లేదా సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ముఖ్యమైన సేవలు అందించడానికి నిరాకరించిన ఉద్యోగులపై చర్య తీసుకునేందుకు ఎస్మా చట్టం ప్రయోగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిప్రకారం ఎవరైనా తమ నిబంధనను ఉల్లంఘించినట్లు తేలితే ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసులకు అధికారం ఇస్తుంది.ఈ చట్టం ఉల్లంఘిస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా వెయ్యిరూపాయల జరిమానా లేదా రెండూ విధించ వచ్చు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది మేలో ఎస్మాను ప్రయోగించింది. 


Updated Date - 2021-12-20T13:19:44+05:30 IST