మాఫియా భూముల్లో దళితులకు ఇళ్ళు : యోగి

ABN , First Publish Date - 2021-08-19T20:31:19+05:30 IST

మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో

మాఫియా భూముల్లో దళితులకు ఇళ్ళు : యోగి

లక్నో : మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మించి, దళితులు, పేదలకు ఇస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శాసన సభలో గురువారం ఆయన ఈ ప్రకటన చేశారు. 


యోగి ఈ ఏడాది ఫిబ్రవరిలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాట్లాడుతూ, తన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భూ మాఫియా నుంచి దాదాపు 67 వేల ఎకరాలకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. ఈ భూముల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. 


ప్రతిపక్షాలపై ఆగ్రహం

కొందరు (ప్రతిపక్ష నేతలు) నిస్సిగ్గుగా తాలిబన్లను సమర్థిస్తున్నారని, అలాంటివారు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని యోగి మండిపడ్డారు. ఇటువంటి నేతల గురించి అందరికీ తెలియజేయాలన్నారు. 


Updated Date - 2021-08-19T20:31:19+05:30 IST