‘క్‌’.. సైకలాజికల్‌ ఫాంటసీ టచ్ ఇవ్వబోతోంది

ధర్మరాజ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మాతలు నవీన్‌, ప్రభు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘క్‌’. విభిన్న కథాంశంతో తెరకెక్కించిన సైకలాజికల్‌ ఫాంటసీ సినిమా ఇది. తమిళ ప్రేక్షకులు ఇంతకుముందెన్నడు పొందని అనుభూతిని ఈ చిత్రం ద్వారా పొందనున్నారు. ఈ నెల 10వ తేదీ విడుదలకానున్న ఈ చిత్రంలో కొత్తవారైన యోగేష్‌, అనికా జంటగా నటిస్తున్నారు. వీరితో పాటు గురుసోమసుందరం, ఆడుగళం నరేన్‌, వైజీ మహేంద్రన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాధాకృష్ణన్‌ అనే కెమెరామెన్‌ తొలిసారి ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సంగీతం గవాస్కర్‌ అవినాష్‌. 


‘జీవి’ అనే చిత్రం ద్వారా తన ప్రతిభ నిరూపించుకున్న దర్శకుడు బాబు తమిళ్‌ ఇపుడు ‘క్‌’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. సినీ ప్రపంచంలో థ్రిల్లర్‌ కోణంలో అనేక చిత్రాలు వచ్చినప్పటికీ సైకలాజికల్‌ జానర్‌లో తెరకెక్కే చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఆ నమ్మకంతోనే ఆ జానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు నిర్మాతలు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

Advertisement