అలాస్కాలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న భారత్, అమెరికా బలగాలు..!

ABN , First Publish Date - 2021-10-25T03:41:50+05:30 IST

అీమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోగల ఓ సైనిక స్థావరంలో జరిగిన కార్యక్రమంలో భారత్, అమెరికా బలగాలు యోగాను అభ్యసించాయి.

అలాస్కాలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న భారత్, అమెరికా బలగాలు..!

వాషింగ్టన్: అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోగల ఓ సైనిక స్థావరంలో జరిగిన కార్యక్రమంలో భారత్, అమెరికా బలగాలు యోగాను అభ్యసించాయి. అక్కడి సైనికులుకు యోగా గురువులు సూర్యనమస్కారాలతో సహా మొత్తం 17 ఆసనాలు నేర్పించారు. భారత్ అమెరికా సంయుక్త శిక్షణ కార్యక్రమం యుద్ధ అభ్యాస్ 21 ప్రారంభమైన నేపథ్యంలో ఈ యోగా తరగతులు జరిగాయి. భారత రక్షణ శాఖ సమాచారం ప్రకారం.. అమెరికాలోని 40 కావల్రీకి రెజిమెంట్‌కు చెందిన 300 మంది సైనికులు, భారత్‌కు చెందిన 7 మడ్రాస్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ గ్రూప్‌కు చెందిన 350 సైనికులు ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. మొత్తం 14 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో ఉగ్రవాద నిరోధక వ్యూహాలపై కూడా ఇరు దేశాల సైనికులు శిక్షణ పొందనున్నారు. 

Updated Date - 2021-10-25T03:41:50+05:30 IST