యోగా నేపాల్‌లో పుట్టింది, ఇండియా అప్పుడు లేనేలేదు: నేపాల్ ప్రధాని

ABN , First Publish Date - 2021-06-22T04:21:54+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మీ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

యోగా నేపాల్‌లో పుట్టింది, ఇండియా అప్పుడు లేనేలేదు: నేపాల్ ప్రధాని

ఖాట్మండూ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మీ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా జన్మస్థలం నేపాల్ అంటూ కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. ‘‘యోగా ఉనికిలోకి వచ్చింది నేపాల్‌లోనే. ఆ సమయంలో భారత్ లేనేలేదు. అప్పట్లో ఇది వివిధ భాగాలుగా విడిపోయి ఉంది. బులావటూర్‌లోని తన స్వగృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో నిజాలను భారత నిపుణులు దాస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. శ్రీరాముడి జన్మస్థలంపై కూడా ఓలీ గతేడాది వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రాముడు జన్మించిన ఆయోధ్య ఉన్నది నేపాల్‌లో అంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్య పెద్ద చర్చకే దారి తీసింది. 

Updated Date - 2021-06-22T04:21:54+05:30 IST