కర్నాల్ : దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా భారతీయులకు సలహా ఇచ్చారు.ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కష్టపడి పని చేయాలని రాందేవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.‘‘నాలాంటి సన్యాసి కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడుతున్నా, సాధారణ ప్రజలు కూడా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడి పనిచేసి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలి’’ అని రాందేవ్ అన్నారు.2014వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే లీటరు పెట్రోల్ రూ.40లకే, వంటగ్యాస్ సిలిండర్ రూ.300లకే ఇచ్చే ప్రభుత్వం వస్తుందని రాందేవ్ బాబా ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఓ విలేఖరి గుర్తు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అలాంటి ప్రశ్నలు అడగవద్దు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను తేకేదార్నా?’’ అని రాందేవ్ విలేకరితో కోపంగా అన్నారు.విలేఖరి వేసిన ప్రశ్నపై నోర్మూసుకో అంటూ రాందేవ్ బాబా బెదిరించారు.
ఇవి కూడా చదవండి