ఆరోగ్య సాధన క్రియ

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

మనం అసాధారణమైన సవాలు విసురుతున్న కాలంలో నుంచి ప్రయాణిస్తున్నాం. కరోనా వైరస్‌ ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మన పరిధినీ, అంతర్గత సమతుల్యతనూ, క్షేమాన్నీ పెంచుకోవడం...

ఆరోగ్య సాధన క్రియ

మనం అసాధారణమైన సవాలు విసురుతున్న కాలంలో నుంచి ప్రయాణిస్తున్నాం. కరోనా వైరస్‌ ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మన పరిధినీ, అంతర్గత సమతుల్యతనూ, క్షేమాన్నీ పెంచుకోవడం కీలకమవుతోంది. మనం బలోపేతం కావాలి. మన చుట్టూ ఉన్నవారికి అండగా నిలవాలి. దీనికోసం సరళమైనదే అయినా శక్తిమంతమైన ‘సింహక్రియ’ను సాధన చేయాలి. ఊపిరితిత్తులకు బలాన్నిచ్చే ఈ క్రియను రోజూ అభ్యాసం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని సద్గురు జగ్గీవాసుదేవ్‌ నేతృత్వంలోని ‘ఈశా ఫౌండేషన్‌’ సూచిస్తోంది.


రోజువారీ సాధన:

‘యోగ యోగ యోగేశ్వరాయ’ అనే మంత్రాన్ని 12 సార్లు పఠించి, ‘ఈశా క్రియా ధ్యానం’ చేయాలి.


సింహక్రియ  నియమాలు

  1. భోజనానికీ, అభ్యాసానికీ మధ్య కనీసం రెండున్నర గంటల వ్యవధి ఉండాలి.
  2. 6-70 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారెవరైనా ఈ అభ్యాసం చేయవచ్చు. వారి శారీరకమైన, వైద్యపరమైన పరిస్థితులతో పని లేదు.
  3. ఆరేళ్ళ కన్నా తక్కువ ఉన్నవారూ, డెబ్భయ్యేళ్ళ పైబడినవారు కూడా ఇది చేయవచ్చు. కానీ వారు ఊపిరికి సంబంధించిన అభ్యాసాన్ని 21 సార్లు కాకుండా 12 సార్లు మాత్రమే చెయ్యాలి.
  4. బ్రెయిన్‌ హెమరేజ్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్న వ్యక్తులు కూడా అభ్యాసం చెయవచ్చు. కానీ ఊపిరి అభ్యాసం 12 సార్లు మాత్రమే చేయాలి. 
  5. లాక్‌డౌన్‌, క్వారంటైన్‌ సమయాన్ని లోతైన అభ్యాసాల కోసం, అంతర్గతమైన అభివృద్ధి కోసం, స్థిరత్వం కోసం ఉపయోగించుకోవాలని అనుకున్న వారు 40 రోజుల పాటు సాధన చేయవచ్చు. దీనికోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

(మంత్రాన్ని ఎలా పఠించాలో, ధ్యానం ఎలా చేయాలో, సింహక్రియను ఎలా అభ్యాసం చేయాలో తెలిపే వీడియోల కోసం, పూర్తి వివరాల కోసంhttps://isha.sadhguru.org/in/en/blog/article/offerings8sadhguru8challenging8times లింక్‌ను చూడవచ్చు).


కోవిడ్‌ యోధుల కోసం...

శరీరం, మనస్సు, మనోభావాలూ, ప్రాణశక్తులు... ఇవన్నీ సమస్థితిలో ఉన్న వారు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించగలుగుతారు. దీనికోసం దోహదం చేసే ‘ఇన్నర్‌ ఇంజనీరింగ్‌’ను ప్రస్తుత కరోనా వేళ ఆరోగ్య, పోలీసు శాఖల్లో పని చేస్తున్న కోవిడ్‌ యోధులకు ఈశా ఫౌండేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారాఉచితంగా అందిస్తోంది. ఇతరులు కూడా యాభై శాతం తగ్గింపుతో ఆరు భాషల్లో అందించే ఈ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు 21 నిముషాల ‘శాంభవీ మహాముద్ర క్రియ’ ఉపదేశానికి అర్హత పొందుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31 లోగా (తెలుగులో కోర్సు కోసం) Isha.co/ieo8tel లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు. 


Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST