‘మొరార్జీ దేశాయ్‌’లో యోగ కోర్సులు

ABN , First Publish Date - 2022-06-27T22:20:01+05:30 IST

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగ (ఎండీఎన్‌ఐవై) - స్వల్ప కాలిక యోగ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌

‘మొరార్జీ దేశాయ్‌’లో యోగ కోర్సులు

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగ (ఎండీఎన్‌ఐవై) - స్వల్ప కాలిక యోగ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమౌతాయి.  


ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ యోగ సైన్స్‌ ఫర్‌ వెల్‌నెస్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి ఒక నెల. ఉదయం నాలుగు బ్యాచ్‌లు, సాయంత్రం మరో నాలుగు బ్యాచ్‌లు ఉంటాయి. వీటిలోనే ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు బ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. బ్యాచ్‌కు 30 మంది అభ్యర్థులు ఉంటారు. అంటే ప్రతి పూట ఆన్‌లైన్‌లో 60 మందికి, ఆఫ్‌లైన్‌లో మరో 60 మందికి శిక్షణ ఇస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు; సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు తరగతులు ఉంటాయి. నిర్దేశించిన మేరకు అటెండెన్స్‌ ఉంటేనే ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

అర్హత: పదోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. దరఖాస్తుకు మెడికల్‌ సర్టిఫికెట్‌, అభ్యర్థి ఫొటో, పదోతరగతి సర్టిఫికెట్‌ జతచేయాలి. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.3000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 27


సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగ ఫర్‌ ప్రొటోకాల్‌ ఇన్‌స్ట్రక్టర్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి మూడు నెలలు. ఉదయం రెండు బ్యాచ్‌లను ఆన్‌లైన్‌ విధానంలో; సాయంత్రం ఒక బ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో, మరో బ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. బ్యాచ్‌కు 30 మంది అభ్యర్థులు ఉంటారు. ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తరగతులు ఉంటాయి. హిందీ/ ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధన ఉంటుంది. 

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫౌండేషన్‌ కోర్స్‌ ఇన్‌ యోగ సైన్స్‌ ఫర్‌ వెల్‌నెస్‌/ ఒక నెల వ్యవధి గల తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. యోగ టీచింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తిగా ఆరోగ్యవంతులై ఉండాలి. దరఖాస్తుతోపాటు అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్‌లు, అభ్యర్థి ఫొటో, ఆధార్‌ కార్డ్‌ కాపీ జతచేయాలి.  ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ విధానంలో అడ్మిషన్స్‌ ఇస్తారు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.9,750

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 28

వెబ్‌సైట్‌: yogamdniy.nic.in

Updated Date - 2022-06-27T22:20:01+05:30 IST