సహజ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-20T05:22:32+05:30 IST

సహజ యోగాతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం సాధించుకోగలుగుతారని సహజ యోగా ట్రస్ట్‌ నిర్వాహకుడు సనపల వరదరాజులు అన్నారు.

సహజ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సమావేశంలో మాట్లాడుతున్న వరదరాజులు

యోగా ట్రస్ట్‌ నిర్వాహకుడు సనపల వరదరాజులు 

విశాఖపట్నం, జూన్‌ 19 : సహజ యోగాతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం సాధించుకోగలుగుతారని సహజ యోగా ట్రస్ట్‌ నిర్వాహకుడు సనపల వరదరాజులు అన్నారు. మురళీనగర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహజ యోగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రపం చ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు మాతాజీ నిర్మలాదేవి ట్రస్ట్‌ను స్థాపించి సహజ యోగాను ప్రపంచానికి పరి చయం చేశారన్నారు. 150 దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు దీన్ని సాధన చేసి మంచి ఫలితాలు సాధించారని చెప్పారు.


ప్రస్తుత కొవిడ్‌ కష్టకాలంలో కరోనా వైరస్‌ నియంత్రణకు సహజ యోగా ప్రక్రియ ఎంతో ఉపయుక్తమని అన్నారు.  సహజ యోగ రాష్ట్ర కో ఆర్టినేటర్‌ కె.స్వామిబాబు మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నియంత్రించడంలో సహజయోగా మంచిఫలితం ఇస్తుందని చెప్పారు. కర్ఫ్యూ నేపథ్యంలో యూ ట్యూబ్‌ చానెల్‌ ద్వారా  ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల నుంచి మూడు విడతలుగా లైవ్‌ కార్యక్రమం ఉం టుందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహజ యోగ ట్రస్ట్‌ సభ్యులు  వి.ప్రసాద్‌, టి.పవిత్ర, కె.రామకృష్ణ, నిర్మల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:22:32+05:30 IST