Abn logo
Oct 28 2021 @ 00:06AM

వైఎన్‌ – సీఆర్‌ఆర్‌ విద్యా సహకార ఒప్పందం

ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం

నరసాపురం టౌన్‌, అక్టోబరు 27: పట్టణం లోని వైఎన్‌, ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల యాజమాన్యాలు బుధవారం విద్యా సహ కార ఒప్పందం చేసుకున్నాయి. వైఎన్‌ కళా శాల అధ్యాపకులు సీఆర్‌ఆర్‌లో, సీఆర్‌ఆర్‌ అధ్యాపకులు వైఎన్‌లో బోఽధించేలా ఒప్పందం జరిగింది. వైఎన్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ, సీఆర్‌ఆర్‌ అధ్యాపకులు డాక్టర్‌ జి. సత్యనారాయణ, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం ఒప్పంద పత్రాలు అందుకున్నారు. పీజీ డైరెక్టర్‌ చింతారావు, డీన్‌ రామకృష్ణ, ప్రిన్సిపాల్‌ పార్థసారథి, అడ్వైజర్‌ సుబ్బారావు,  రమణ పాల్గొన్నారు.