గుంతకల్లు మీదుగా యశ్వంతపూర్‌-గౌహతి ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2021-04-21T06:06:03+05:30 IST

యశ్వంతపూర్‌-గౌహతి-యశ్వంతపూర్‌ (వయా గుంతకల్లు) ఎక్స్‌ప్రెస్‌ (నెం. 06577) ప్రత్యేక వీక్లీ వేసవి రైలును ఈనెల 23 నుంచి న డపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.

గుంతకల్లు మీదుగా యశ్వంతపూర్‌-గౌహతి ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు, ఏప్రిల్‌ 20: యశ్వంతపూర్‌-గౌహతి-యశ్వంతపూర్‌ (వయా గుంతకల్లు) ఎక్స్‌ప్రెస్‌  (నెం. 06577) ప్రత్యేక వీక్లీ వేసవి రైలును ఈనెల 23 నుంచి న డపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈరైలు ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి గుంతకల్లుకు శనివారం తెల్లవారుజాము 2-20 గంటలకు వచ్చి, ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు గౌహతికి చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06578) సోమవారం తెల్లవారుజాము 7-35 గంటలకు గౌహతిలో బయలుదేరి మంగళవారం 9-35 గం టలకు గుంతకల్లుకు వచ్చి, బుధవారం తెల్లవారుజాము 1-30 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు ధర్మవరం, గుంతకల్లు, రాయచూరు, సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, భువనేశ్వర్‌, ఖరగ్‌పూర్‌, రాంపురత, మేల్డా టౌన, న్యూ జల్పాయ్‌గురి, న్యూబంగాయ్‌ గావ్‌ మీదుగా గౌహతికి చేరుతుందన్నారు. 


Updated Date - 2021-04-21T06:06:03+05:30 IST