అవును... ఆ అపర కుబేరుల ‘పన్ను’లు... అంతే...

ABN , First Publish Date - 2021-06-11T20:31:10+05:30 IST

అపర కుబేరులు వారు. కానీ పన్నులు మాత్రం చెల్లించలేదు. అవును.. ఇది నిజమే.

అవును... ఆ అపర కుబేరుల ‘పన్ను’లు... అంతే...

న్యూయార్క్ : అపర కుబేరులు వారు. కానీ పన్నులు మాత్రం చెల్లించలేదు. అవును.. ఇది నిజమే. మరి వారెవరంటే... ధనవంతుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యాపార దిగ్గజాలు. నిత్యం కోట్లల్లో సంపాదన. మరి పన్నులెందుకు కట్టడం లేదు ? ఈ కథనం చదవండి...


జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ తదితర ప్రపంచ కుబేరుల సంపాదన భారీగా ఉంటుందన్నది తెలిసిన విషయమే. వారు చెల్లించే పన్నులు కూడా అంతేస్థాయిలో ఉంటాయని ఎవరైనా అనుకుంటుంటారు. కానీ... అపలు విషయమేమిటంటే... వారు చెల్లించే పన్నులు అతి తక్కువగానే ఉంటా, లేదా... దా దాదాపు ఏమీ ఉండదని కూడా చెప్పొచ్చు. ఈ వివరాలు చూడండి... 


అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2007, 2011 సంవత్సరాల్లో  ఎలాంటి పన్నులు చెల్లించలేదు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా అంతే. ఆయన కూడా 2018 లో చెల్లించలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 


సంచలనాలకు మారుపేరైన మీడియా సంస్థ ‘ప్రో పబ్లికా’ తమ పరిశోధనాత్మక కథనంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. గత పదిహేనేళ్లకు సంబంధించిన ఐఆర్‌ఎస్ డేటా రికార్డ్డ్‌లను సంపాదించి ఈ విషయాలను  వెలుగులోకి తెచ్చింది. కుబేరుల జాబితాలోని మొదటి 25 మంది ఆదాయ పన్ను వివరాలను చూస్తే షాక్ తినాల్సిందే. వారి సంపద పెరిగిన తీరుకు, చెల్లిస్తున్న పన్నులకు పొంతనే లేదు. తద్వారా అమెరికా పన్ను వ్యవస్థ అత్యంత పటిష్టమైనదనే వాదన తేలిపోయిందన్న వ్యాఖ్యానాలకు కొదవే లేవు. అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

Updated Date - 2021-06-11T20:31:10+05:30 IST