పర్యాటకుల స్వర్గధామం యస్‌ ఐలాండ్‌

ABN , First Publish Date - 2021-05-16T05:30:00+05:30 IST

మిరుమిట్లు గొలిపే బాణసంచా... ఎటుచూసినా తారాజువ్వల కాంతులతో ఆ దీవి మొత్తం వెలిగిపోయింది. రంజాన్‌ సందర్భంగా అబుదాబిలోని యస్‌ దీవిలో బాణసంచాను కాల్చి పండుగను ఘనంగా జరుపుకొన్నారు...

పర్యాటకుల స్వర్గధామం యస్‌ ఐలాండ్‌

మిరుమిట్లు గొలిపే బాణసంచా... ఎటుచూసినా తారాజువ్వల కాంతులతో ఆ దీవి మొత్తం వెలిగిపోయింది. రంజాన్‌ సందర్భంగా అబుదాబిలోని యస్‌ దీవిలో బాణసంచాను కాల్చి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. 


  1. యస్‌ ఐలాండ్‌ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఈమధ్యకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న వినోద కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడికి అబుదాబి నుంచి 20 నిమిషాల్లో  చేరుకోవచ్చు. దుబాయి నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. 
  2. ఇక్కడ ఈదుల్‌ ఫితర్‌ వేడుకలను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల మధ్య పర్యాటకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
  3. ఈ ఐలాండ్‌లో ధీమ్‌ పార్క్స్‌, షాపింగ్‌ మాల్స్‌, గోల్స్‌కోర్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటివి ఉన్నాయి. మ్యూజికల్‌, ఫ్యామిలీ ఈవెంట్స్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హోటల్స్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌లు వేడుకలకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. 
  4. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్‌లో అవార్డులు గెలుచుకున్న థీమ్‌ పార్కులు ఉన్నాయి అందులో ఫెరారీ వరల్డ్‌ ఒకటి. వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ రోలర్‌ కోస్టర్‌ ఇక్కడే ఉంది. గంటకు 240 కి.మీ వేగంతో 52 మీటర్ల ఎత్తు వరకు వెళుతుంది.
  5. ఈ ఐలాండ్‌ను సందర్శించే పర్యాటకుల కోసం పూర్తిస్థాయిలో కొవిడ్‌ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాదాపు 93 శాతం వాక్సినేషన్‌ పూర్తయింది. అంతేకాదు ప్రపంచంలోనే పూర్తి వాక్సినేషన్‌ జరుపుకొన్న మొదటి హాలిడే డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. 

Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST