వైసీపీ నేతల చెప్పినట్లు చేస్తే...

ABN , First Publish Date - 2021-01-16T05:05:57+05:30 IST

కొండపి ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు డిప్యూటేషన్‌ రద్దు ఆగింది. సంతనూతలపాడు ఎంపీడీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గతేడాది నుంచి కొండపికి ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. తాజాగా కొండపికి చీమకుర్తి ఎంపీడీవోను బదిలీ చేశారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైసీపీ నాయకులు ఆఖరి నిమిషంలో చక్రం తిప్పారు. ఇక్కడే కొనసాగాలంటే పలు షరతులకు అంగీకరిస్తే చాలని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావుకు సూచించినట్లు సమాచారం.

వైసీపీ నేతల చెప్పినట్లు చేస్తే...


కొండపి ఇన్‌చార్జి ఎంపీడీవో బదిలీపై విమర్శలు

తొలుత బదిలీ.. ఆ తర్వాత చక్రం తిప్పిన అధికార పార్టీలోని ఒక వర్గం 

అతను కొనసాగాలంటే పలు ఆంక్షలు పెట్టిన మరో వర్గం

అందుకు అంగీకరించడంతో డిప్యూటేషన్‌ ఉత్తర్వుల రద్దు


కొండపి, జనవరి 15 : కొండపి ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు డిప్యూటేషన్‌ రద్దు ఆగింది. సంతనూతలపాడు ఎంపీడీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గతేడాది నుంచి కొండపికి ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. తాజాగా కొండపికి చీమకుర్తి ఎంపీడీవోను బదిలీ చేశారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు వైసీపీ నాయకులు ఆఖరి నిమిషంలో చక్రం తిప్పారు. ఇక్కడే కొనసాగాలంటే పలు షరతులకు అంగీకరిస్తే చాలని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావుకు సూచించినట్లు సమాచారం. అం దుకు ఆయన అంగీకరించడంతో జిల్లాలోని వైసీ పీ ముఖ్య నాయకుల సిఫార్సుతో డిప్యూటేషన్‌ రద్దు ఆగినట్లు తెలిసింది. ఇన్‌చార్జి ఎంపీడీవో వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న అధికార పార్టీలోని కొందరు నేతలు కూడా ఆ పార్టీకే చెందిన మండల స్థాయి కీలక నాయకుడు హామీతో మెత్తబడ్డారు. దీంతో శ్రీనివాసరావుకు మార్గం సుగమమైంది.

ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఏడాదిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ప్రధానమైన ఆరు గ్రామ పంచాయతీలకు ఆరు నెలల క్రితం వరకు ప్రత్యేకాధిగా పనిచేశారు. కొండపి, ఇలవర(నేతివారిపాలెం), పెట్లూరు, మూగచింతల, అనకర్లపూడి, కె. ఉప్పలపాడు గ్రామ పంచాయతీలకు ప్రారంభంలో పనిచేశా రు. తర్వాత నాయకులు గగ్గోలు పెట్టడంతో కొన్ని గ్రామ పంచాయతీల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి వైదొలిగారు. కొవిడ్‌ సమయంలో బ్లీచింగ్‌ కొనుగోళ్ల నుంచి, గ్రామ పంచాయతీల్లో పనులకు తీర్మానాలు ఇచ్చే వరకు ఎంపీడీవో వివాదాస్పదంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి.

ఉపాధి పథకం సీవోతో వివాదం

శ్రీనివాసరావుకు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స కంప్యూటర్‌ ఆపరేటర్‌కు మధ్య వారం క్రితం వాదోపవాదా లు జరిగాయి. తనకు తెలియకుండా కంప్యూటర్‌లలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది బిల్లులు, పనుల మస్టర్లను ఎక్కించవద్దని ఆపరేటర్‌ను ఇన్‌చార్జి ఎంపీడీవో ఆదేశించారు. సిబ్బంది జీతాల బిల్లు లు ‘మీకు చెప్పాల్సిన అవసరం లేదని’ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అనడంతో.. ‘సస్పెండ్‌ చేస్తా’నని ఎంపీడీవో హెచ్చరించినట్లు తెలిసిం ది. ఈ సంఘటన జరిగినప్పుడు అక్క డే ఉన్న వైసీపీ జిల్లా నాయకుడొకరు కంప్యూటర్‌ ఆపరేటర్‌కు మద్దతుగా మాట్లాడి, ఇన్‌చార్జి ఎంపీడీవో చర్యలను నిరసించారని సమాచారం. ఇది జరిగిన నాలుగు రోజులకే ఎంపీడీవోకి తన డిప్యుటేషన్‌ రద్దు అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. 

తొలుత ఇన్‌చార్జి ఎంపీడీవో బదిలీ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. తిరిగి అధికార పార్టీ నాయకులు కొందరు ఎంపీడీవోను ఇన్‌చార్జిగా ఇక్కడే మరో రెండు నెలలపాటు కొనసాగించాలని జిల్లా నాయకుల చేత ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించారు. దీంతో డిప్యుటేషన్‌ రద్దు ఆగిందని వైసీపీలోని ఓ వర్గ నేతలు అంటున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఎంపీడీవో వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించగా ప్రస్తుతం డిప్యుటేషన్‌ రద్దు ఆగిందని, సంతనూతపాడు నుంచి పూర్తిగా ఇక్కడకు బదిలీ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన ఆంధ్రజ్యోతికి వివరించారు. 


Updated Date - 2021-01-16T05:05:57+05:30 IST