ఆర్బీఐకి రూ. 50 వేల కోట్లు చెల్లించిన ఎస్ బ్యాంక్,..

ABN , First Publish Date - 2020-09-12T00:19:25+05:30 IST

స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ(ఎస్‌ఎల్‌ఎఫ్) బకాయిల కింద రూ. 50 వేల కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంకు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించింది. ఈ మేరకు యస్ బ్యాంకు చైర్మన్ సునీల్....

ఆర్బీఐకి రూ. 50 వేల కోట్లు చెల్లించిన ఎస్ బ్యాంక్,..

ముంబై : స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ(ఎస్‌ఎల్‌ఎఫ్) బకాయిల కింద రూ. 50 వేల కోట్ల మొత్తాన్ని యస్ బ్యాంకు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించింది. ఈ మేరకు యస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలలో ఎస్ బ్యాంకుకు... ఆర్బీఐ ఈ నిధులను అందించింది. అయితే ఈ మొత్తాన్ని గడువు కంటే ముందుగానే సెప్టెంబర్ 8 వ తేదీన ఆర్బీఐకి చెల్లించింది. ఆర్బీఐకి ఎస్ఎల్ఎఫ్ నిధులు ముందుగానే చెల్లించినందుకు సంతోషంగా ఉందని వర్చువల్ వార్షిక సాధారణ సమావేశంలో షేర్ హోల్డర్లకు మెహతా తెలిపారు. బ్యాంకు స్థిరమైన వృద్ధికి మూడు కీలక స్తంభాల్లో పాలన ఒకటని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 10 వేల కోట్ల బెయిలవుట్ అందించిందని, ఈ సంవత్సరం సరికొత్తగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఎస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ, ప్రభుత్వం... బ్యాంకు బోర్డును రీప్లేస్ చేశాయి కూడా. ఈ క్రమంలోనే... డిపాజిటర్లకు కొన్ని రోజులు యాక్సెస్ లేకుండా నిలుపుదల చేశాయి. కాగా... కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత ఆంక్షలనుఎత్తివేశారు. 

ఇదిలా ఉండగా... ఎస్ బ్యాంకు.. ఎస్బీఐలో విలీనమవుతుందా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎస్బీఐతో విలీనం కాదని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-09-12T00:19:25+05:30 IST