కన్నెర్ర కాల్వ

ABN , First Publish Date - 2020-10-31T04:30:31+05:30 IST

వర్షాకాలంలో ఎర్రకాల్వ పేరు తలిస్తేనే రైతు వెన్నులో వణుకు పుడుతుంది. పంట చేతికొస్తుందా..? లేదా అని బెంగతోనే కాలం గడుపు తుంటారు.

కన్నెర్ర కాల్వ
వీరంపాలెం వద్ద కూలిపోయిన వంతెన (ఫైల్‌)

– వర్షాకాలం.. రైతు వెన్నులో వణుకు

– ఇటీవల వరద దాటికి వంతెనలు ఫట్‌

– వరద ఉధృతా..? నాణ్యతా లోపమా..?

– సమస్య పరిష్కరించాలని డిమాండ్‌

(తాడేపల్లిగూడెం–ఆంధ్ర జ్యోతి)

వర్షాకాలంలో ఎర్రకాల్వ పేరు తలిస్తేనే రైతు వెన్నులో వణుకు పుడుతుంది. పంట చేతికొస్తుందా..? లేదా అని బెంగతోనే కాలం గడుపు తుంటారు. కొన్ని రోజుల కిందట ఎర్రకాల్వ పొంగి పంటలు దెబ్బతి న్నాయి. నష్టం అక్కడితో ఆగలేదు. ఎర్రకాల్వ వరద ధాటికి వంతెనలే కొట్టుకు పోయాయి. వీరంపాలెం వద్ద, మాధవరం–కంసాలిపాలెం మధ్య రాకపోకలు సాగించే రెండు  ప్రధానమైన వంతెనలు వరదలకు కొట్టుకు పోయాయి. నిర్మాణంలో నాణ్యతాలోపాల వల్లే ఇలా జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మాధవరం – కంసాలిపాలెం వద్ద వంతెన పదేళ్ల కిందట నిర్మించారు. కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి ఆ వంతెన ప్రారంభించారు. వీరంపాలెం వద్ద గతంలో కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మాణం చేపట్టారు. పదేళ్లు కూడా పూర్తి కాకుండానే ఈ రెండు వంతెనలు కూలిపోవడం విమర్శలకు దారి తీస్తోంది. వరద ఉధృతి వల్లే వంతెనల నిర్మాణాలు నిలవడం లేదంటూ మరో వాదన వినిపిస్తోంది. వీరంపాలెం నుంచి నిడదవోలు వెళ్లాలన్నా ఎర్రకాలువ అవతలి వైపు తమ పంట పొలాలకు రైతులు చేరుకోవాలన్నా వీరంపాలెం వంతెన ఒక్కటే ఆధారం. ఆ వంతెన గతంలోనే కూలి పోవడంతో రైతులు తీగలతో వంతెన ఏర్పాటు చేసుకున్నారు. మొన్నటి వరదలకు తీగలతో నిర్మించుకున్న వంతెన కూడా పాడైంది. ఇక మాధ వరం – కంసాలిపాలెం మధ్య నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. మాధ వరం, జగన్నాథపురం నుంచి నిడదవోలు వెళ్లేందుకు మాధవరం– కంసా లిపాలెం వంతెన ఒక్కటే మార్గం. ఇటీవల వరదలకు ఆ వంతెన కూడా కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


ఎర్రకాల్వ వెడల్పుతోనే పరిష్కారం?

వంతెనలు కొట్టుకుపోవడం, నిత్యం పంటపొలాలు దెబ్బతినడంతో  ప్రభుత్వం ఎర్రకాలువ వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో భావించింది. లక్ష క్యూసె క్కులు వరద నీరు ప్రవహించేలా ఎర్రకాల్వను వెడల్పు చేయాలని తలపోశారు.ఈ మేరకు సాంకేతిక కమిటీ  సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం ఎర్రకాల్వ వెడల్పు చేయాలంటే వేల కోట్ల రూపా యలు వెచ్చించాల్సి ఉంటుంది. వందల ఎకరాల భూసేకరణ నిర్వహించాలి. దాంతో ఎర్రకాల్వ వెడల్పు ప్రతిపాదన మరుగున పడిపోయింది. మరోవైపు రూ.133 కోట్లతో చేప ట్టిన ఆధునీకీకరణ పనులు కూడా పూర్తి కాకముందే ఎర్రకాల్వ విరుచుకు పడుతోంది.ఇరువైపులా గట్లకు గండ్లుపడుతున్నాయి.వాటిని పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం లేదు. అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయి.  


Updated Date - 2020-10-31T04:30:31+05:30 IST