సత్తాచాటిన ఎర్రబాలెం ఎడ్లు

ABN , First Publish Date - 2021-01-27T06:16:03+05:30 IST

పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం నందు జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి.

సత్తాచాటిన ఎర్రబాలెం ఎడ్లు


నరసరావుపేట రూరల్‌, జనవరి 26 : పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గల డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం నందు జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన నాలుగు పళ్ల విభాగంలో ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెం దిన వెంకటగిరి హేమలత నాయుడుకు చెందిన ఎడ్ల జత 4,685 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కలసపాడు మండలానికి చెందిన దేసి వెంకటరెడ్డికి చెందిన ఎడ్ల జత 4,380అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులకు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు మోరే రవీంద్రారెడ్డి, కనక పుల్లారెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. 

Updated Date - 2021-01-27T06:16:03+05:30 IST