రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2020-10-24T10:29:26+05:30 IST

‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడం, పోలీసుల చేత కొట్టించడం ..

రాష్ట్రంలో రాక్షస పాలన

మాజీ ఎమ్మెల్యే యరపతినేని


రెంటచింతల, అక్టోబరు 23: ‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడం, పోలీసుల చేత కొట్టించడం లాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు.. ఏది మంచో.. ఏది చెడో ఆలోచించే విచక్షణ కోల్పోయారు.. ఇలాంటి దుర్మార్గపు పాలన రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూడలేదు.. టీడీపీ 22 సంవత్సరాలు అధికారంలో వున్నా ఇలాంటి నికృష్ట రాజకీయాలు చేయలేద’ని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం ఆయన రెంటచింతలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


సీఎం జగన్‌పై కోర్టుల్లో విచారణ ప్రారంభమైందని, 6నెలల్లో జైలుకెళ్తాడని జోస్యంచెప్పారు. శాంతిభద్రతలు కాపాడే పోలీసులు పక్షపాతంతో వ్యవహరించకూడదన్నారు. రైస్‌ రీఫిల్లింగ్‌, గుట్కా, జూదం, మద్యం, మైనింగ్‌ తదితర వాటిల్లో వైసీపీ నేతలు సిద్ధహస్తులన్నారు. పాలన పడకేసిందని పేర్కొంటూ న్యాయవ్యవస్థపైనే అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిని చంపేశారని, రూ. లక్షా 20కోట్లు అప్పు చేశారన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆరుగురు టీడీపీ నేతలను మట్టుబెట్టారన్నారు. మంచికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత గోగుల సీతారెడ్డిని మాచర్లలో హౌస్‌ అరెస్ట్‌చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, మూలి రాజారెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, యరపతినేని మట్టయ్య, వెన్నా కృష్ణారెడ్డి, మునినాయక్‌, లింగారెడ్డి, మాజీ జడ్పీటీసీ షేక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.


కార్యకర్త భయపడాల్సిన పనిలేదు

రెంటచింతల: ‘ఏ కార్యకర్త భయపడాల్సిన పని లేదు.. ఎల్లకా లం వీళ్లే అధికారంలో ఉండరు.. మనకూ టైం వస్తుంది.. అప్పుడు అంతకంత తీరుస్తాం.. మనుషులు చనిపోతే కర్మకాండలు కూడా చేయించుకోనివ్వరా.. ఇదేం ప్రభుత్వమండీ’ అంటూ మాజీ ఎమ్మె ల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇటీవల మృతి చెందిన  బోయిన సర్వయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యరపతినేని దృష్టికి తీసుకొచ్చారు. సర్వయ్య నిఖార్సైన నాయకుడని, టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగాడని పేర్కొన్నారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, మూలి రాజారెడ్డి, మాజీ ఎంపీపీ శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, వెన్నా కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.


టీడీపీలో యువతకు ప్రాధాన్యం

గురజాల, అక్టోబరు 23: తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం వుంటుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు తెలిపారు. శనివారం గురజాల మండల పర్యటనలో భాగంగా తేలుకుట్ల గ్రామంలో మాట్లాడుతూ నరసింహారెడ్డి లాంటి యువకులు టీడీపీలోకి రావడం శుభసూచికమన్నారు. అన్ని గ్రామాల నుంచి యువత పార్టీలోకి రావాలని పిలుపు నిచ్చారు. వైసీపీ కేవలం మాటలకే పరిమితమని, అభివృద్ధి ఏమైనా జరిగిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పడు మాత్రమే జరిగిందన్నారు.

Updated Date - 2020-10-24T10:29:26+05:30 IST