Abn logo
Mar 7 2021 @ 00:13AM

వేర్వేరు ఘటనల్లో ఇరువురి ఆత్మహత్య

ఎమ్మిగనూరు టౌన్‌, మార్చి 6: ఎమ్మిగనూరు పరిధిలో శనివారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఆర్థిక పరిస్థితులు బాలేక డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అప్పులబాధతో సూర్యనారా యణగౌడ్‌(35) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సి.బెళగల్‌ మండల కేంద్రానికి చెందిన సూర్యనారాయణగౌడ్‌ రెండు ఎకరాల పొలం ఉంది. ఏటా దిగుబడులు రాక అప్పులే మిగిలాయి. దీంతో ఎమ్మిగనూరుకు వచ్చి వీవర్స్‌కా లనీలో టీ వ్యాపారం చేసేవాడు. అయినా కలిసిరాక పోవడంతో మనోవైదనకు గురై బనవాసి అడవుల్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్పాడడ్డాడు. సమాచారం మేరకు పోలీసులు చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు.


ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని..

తండ్రి దూరమై పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని ఇందు(22) శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల మేరకు.. పట్టణంలోని నెహ్రునగర్‌కు చెందిన నాగరాజు, వీరకాంతమ్మకు ఇద్దరు కుమార్తెలు. తండ్రి నాగరాజు వ్యసనాలకు లోనై భార్యతో గొడవపడి మూడేళ్ల కిత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి పిల్లల ఆలనా, పాలన తల్లి వీరకాంతమ్మ చూసు కుంటోంది. అయితే తండ్రి దూరం కావడం ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండటంతో పెద్దకుమార్తె ఇందు మనోవేదనకు గురై ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యానుకు ఊరేసుకుంది. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీ సులు మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌నాయక్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement