పసుపుమయం.. జాతీయ రహదారి

ABN , First Publish Date - 2022-05-27T05:46:41+05:30 IST

ఒంగోలులో మహానాడుకు హాజరయ్యేం దుకు వస్తున్న మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు అద్దంకి నియోజకవర్గ ప్రజ లు ఘన స్వాగతం పలికారు.

పసుపుమయం.. జాతీయ రహదారి
బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

యువతలో ఉప్పొంగిన ఉత్సాహం

హారతులు ఇచ్చి తిలకం దిద్దిన మహిళలు

అద్దంకి, మే 26: ఒంగోలులో మహానాడుకు హాజరయ్యేం దుకు వస్తున్న మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడుకు అద్దంకి నియోజకవర్గ ప్రజ లు ఘన స్వాగతం పలికారు.  టీడీపీ  శ్రేణులు అన్ని  గ్రా మాల నుండి మోటార్‌సైకిళ్ళపై నియోజకవర్గ సరిహద్దు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్దకు ర్యాలీలుగా చేరారు. మధ్యా హ్నాం 12 గంటల సమయానికే వేల సంఖ్యలో టీడీపీ  శ్రేణు లు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. మండుటెండలోనూ సుమారు 4 గంటల సమయం అక్కడే వేచి ఉండి సా యంత్రం 4.30 గంటల సమయంలో చం ద్రబాబునాయుడు రావటంతో ఒక్కసారిగా జాతీయ  రహదారి పైకి వచ్చి స్వా గతం పలికారు. దీంతో జాతీయ రహదారి మొత్తం తెలుగు తమ్ముళ్లతో పసుపుమయం గా మారింది.

అక్కడ నుంచి మోటార్‌సైకిళ్ళు, కార్లు ర్యాలీతో ము ప్పవరం, మేదరమెట్ల మీదుగా గుళ్ళాపల్లి గ్రోత్‌ సెంటర్‌  వద్ద  సంతనూతలపాడు  నియోజకవర్గం లోకి ప్రవేశించా రు. నార్నెవారిపాలెం, బైటమంజులూరు, ముప్పవరం, మేదరమెట్ల, తిమ్మనపాలెం తదితర  ప్రాంతాలలో ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జాతీయ  రహదారి మీదకు వచ్చి స్వాగతం పలికారు. టోల్‌ప్లాజా వద్ద మహిళలు చం ద్రబాబుకు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. వేల సంఖ్యలో వచ్చిన టీడీపీ శ్రేణులతో జాతీయరహదారి మొత్తం కిలోమీటర్ల దూరం వాహన శ్రేణి  సాగింది. 

చంద్రబాబు వచ్చే ముందు అటుగా వచ్చిన మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీం ద్ర, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వచ్చిన సందర్భంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో వాళ్ళను కలిశారు. ఉమామహే శ్వర రావు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ నడుపుతూ ఉత్సా హపరిచారు. అదే  సమయంలో  తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆలపాటి దుర్గాభవాని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ నడిపి తెలుగు తమ్ముళ్ళలో ఉత్సా హం నింపారు. అమరావతికి చెందిన యువతి మోటార్‌ సైకిల్‌ పై జెండా పట్టుకొని  ప్రయాణిస్తూ అందరిని ఆశ్చర్య పరిచింది. 

బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు మాజీ మం త్రి కొల్లు  రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే లు పోతుల రామారావు, అశోక్‌రెడ్డి, ప్రకాశం జిల్లా టీడీపీ  అధ్యక్షుడు  నూకసాని బాలాజీ, యర్రగొండపాలెం, చీరాల టీడీపీ ఇన్‌చార్జి లు ఎరిక్షన్‌బాబు, ఎంఎం కొండయ్య, కంచర్ల  శ్రీకాంత్‌ తదితరులు వేచి  ఉండి చం ద్రబాబు కు స్వాగతం పలికారు.

మహానాడుకు తరలిరావాలి

మహానాడు కార్య క్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన చం ద్రబాబునాయుడుకు స్వాగతం పలికేందుకు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కృతజ్ఞతలు  తెలిపారు. ఇదే  ఉత్సాహంతో శుక్ర, శనివారం లలో ఒంగోలు లో జరిగే మహానాడుకు తరలిరావాలని రవికుమార్‌ కోరారు.


బొప్పూడి వద్ద బాబుకు బ్రహ్మరథం

మార్టూరు, మే 26: మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడుకు పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఘనస్వా గతం పలికారు. బొప్పూడి ఆంజనేయస్వామి  గుడిలో ఎమ్మె ల్యే ఏలూరి సాంబశివరావు  ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం  చీరాల నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పి.సాయి కల్పనారెడ్డి,  ఒంగోలుకు చెందిన మహిళా నాయకురాలు అనంతమ్మ, తదితరులు అక్కడకు చేరుకున్నారు. వారితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువకులు భారీగా కార్లు, మోటారు బైక్‌లతో ర్యాలీగా అక్కడకు చేరుకొని చంద్రబాబు రాక కోసం వేచిఉన్నారు.

మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు బొప్పూడి ఆం జనేయస్వామి గుడి వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మె ల్యే ఏలూరి గజమాలతో సత్కరించారు. ఆంజనేయస్వామి అలయంలో పూజలు చేసి తీసుకువచ్చిన పూలమాలను, కండువాను చంద్రబాబుకు వేశారు. తదనంతరం శాలువా కప్పి సత్కరించారు.  

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి 16 వ నంబరు జాతీయరహదారిపై బాపట్ల జిల్లా మార్టూరు వైపు  పర్యటించిన చంద్రబాబు తన కారు నుంచి దిగి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు  కారులో పర్యటించారు. ఈ కారును ఏలూరి స్వయంగా నడుపుతుండటం, అదే కారులో ఏలూరి పక్కన ముందు సీటులో చంద్రబాబు కూర్చోవడంతో నాయ కులు, కార్యకర్తలు సంతోషంతో ఈలలు, కేకలు వేశారు. మరింత ఉత్సాహంతో వారి కారును ర్యాలీగా వాహనాలతో అనుసరించారు.

బారులుతీరిన జనం

చంద్రబాబును చూడటానికి జాతీయరహదారి వెంట జనాలు బారులు తీరి నిల్చొన్నారు. దాంతో చంద్రబాబు వాహనం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యా లయం వద్దకు రావడానికి గంట సమయం పట్టింది. ఆ యనను చూడటానికి రాజుపాలెం క్రాస్‌ రోడ్డు వద్ద డేగరమూడి గ్రామానికి చెందిన మహిళలు  ఎర్రటి ఎండలో ట్రాక్టరుపై మహిళలు రెండు గంటలు దాకా వేచి ఉన్నారు. అక్కడకు వచ్చిన చంద్రబాబు వాహనాన్ని ఆపడంతో కారుపై నుంచి ఆయన మహిళలకు, ప్రజలకు అభివాదం చేశారు. మార్టూరులో హీరో షోరూం ఎదురుగా రాజు గారిపాలెం మాజీ సర్పంచ్‌ ఉప్పలపాటి తిరుపతిరాజు ఆధ్వ ర్యంలో  ఆగ్రామ వాసులు రోడ్డుపైకి రావడంతో వాహనాన్ని ఆపి చంద్రబాబు అభివాదం చేశారు. అలాగే, మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఒంగోలు జాతి గిత్తలను పెంపకం చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎడ్ల పందాలలో బహుమతులను గెలు చుకున్న పోపూరి శ్రీనివాసరావు ఎడ్లబండిపై చంద్రబాబు, ఎమ్మెల్యే ఏలూరితో కలిసి కొంచెంసేపు సవారి చేసి అందరిని అలరించారు. 

మహానాడుకు తరలిరావాలి

శుక్ర, శని వారాలలో ఒంగోలులో నిర్వహిస్తున్న మహా నాడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా తరలి రావాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన విధంగానే నా యకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో మహానాడుకు తరలిరావాలన్నారు.  ఏలూరి క్యాంపు కార్యాలయంలో మహా నాడుకు తరలివచ్చే వారికి భోజనవసతి సౌకర్యాలు  ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-05-27T05:46:41+05:30 IST