‘ఓట్ల కోసమే పసుపు బోర్డు రాజకీయం’

ABN , First Publish Date - 2021-01-25T05:24:19+05:30 IST

పార్లమెంట్‌ ఎన్నికలలో ఓట్ల కోసమే ధర్మపురి అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటును రాజకీయం చేశారని రాష్ట్ర కిసాన్‌కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు.

‘ఓట్ల కోసమే పసుపు బోర్డు రాజకీయం’
మాట్లాడుతున్న రాష్ట్ర కిసాన్‌కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి

నందిపేట, జనవరి24: పార్లమెంట్‌ ఎన్నికలలో ఓట్ల కోసమే ధర్మపురి అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటును రాజకీయం చేశారని రాష్ట్ర కిసాన్‌కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 30న ఆర్మూర్‌ పట్టణంలోని సిద్ధార్థ కాలేజీ స మీపంలో రైతుల దీక్ష ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్య క్రమానికి అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కిగ్‌ ప్రెసిడెంట్‌, మాల్కజ్‌గిరి ఎంపీ రెవంత్‌రెడ్డి వస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూధర్మపురి అర్వింద్‌ గత ఎన్నికల్లో ఎంపీగా గెలవడం కోసం పసుపుబోర్డును వాడుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన పసుపుబోర్డు ఏర్పాటు మద్దతు ధర, చెరుకు మద్దతు ధర ఏది అమలు కాలేదన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసిందని అంటున్న ధర్మపురి అర్వింద్‌ ఆ లేఖనుబహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర కిసాన్‌కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్య క్షుడు పెంట ఇంద్రుడు, నాయకులు పిప్పెర సాయిరెడ్డి, దేగాం గంగారెడ్డి, మంద మహిపాల్‌, గంగాధర్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-01-25T05:24:19+05:30 IST