Covid Effect: ఢిల్లీలో ‘యెల్లో అలర్ట్’.. నిబంధనలు ఇవే

ABN , First Publish Date - 2021-12-29T21:52:37+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనలు విధిస్తోంది. రెండు మూడు రోజులుగా ఏడు నెలల గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి..

Covid Effect: ఢిల్లీలో ‘యెల్లో అలర్ట్’.. నిబంధనలు ఇవే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనలు విధిస్తోంది. రెండు మూడు రోజులుగా ఏడు నెలల గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా యెల్లో అలర్ట్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. ఈ నిబంధనల ప్రకారం.. సినిమా హాళ్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఇక మెట్రోలో 50 శాతం కెపాసిటీతో నడపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కేజ్రీవాల్ తెలిపారు.


ఢిల్లీలో కొత్త ఆంక్షలివే...

-ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫూ

-50 శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాల్లో పని.

-ఆటోలు, టాక్సీల్లో ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

-బార్లు, స్పాలు కేవలం 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలి.

-రెస్టారెంట్లు సైతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.

-వివాహాలు, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు.

-బేసి, సరి సంఖ్యల విధానంలో దుకాణాలు, మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలి.

-ఢిల్లీ మెట్రోలో 50 శాతం సీటింగ్ కెపాసిటీని మాత్రమే అనుమతిస్తారు. నిలబడి ప్రయాణించడానికి అనుమతించరు.

-ప్రార్థనా స్థలాలు తెరిచే ఉంచుతారు. కానీ  భక్తులను లోపలకు అనుమతించరు.

Updated Date - 2021-12-29T21:52:37+05:30 IST