మూడోసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి

ABN , First Publish Date - 2022-04-11T00:23:32+05:30 IST

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తున్న సీపీఎం 23వ కాంగ్రెస్ సదస్సులో ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరోను ఎన్నుకున్నారు.

మూడోసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తున్న సీపీఎం 23వ కాంగ్రెస్ సదస్సులో ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరోను ఎన్నుకున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో పొలిట్‌బ్యూరోను పార్టీ ఎన్నుకుంది. ఈ ఎన్నికలో పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత రామ్ చంద్ర డోమ్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. దళిత నేతకు ఈ పదవి దక్కడం పార్టీలో ఇదే తొలిసారి. పార్టీ పదవుల కోసం గరిష్ట వయసు 75గా నిర్ణయించడంతో కొందరు సీనియర్లు పోటీ చేయలేదు. మరోవైపు సెంట్రల్ కమిటీలో గతంలో 95 మంది ఉండగా, తాజాగా 85 మందితోనే కమిటీని నిర్ణయించారు. తాజా కమిటీలో మొత్తం 17 మంది కొత్తవాళ్లుండగా, 15 మంది మహిళలకు చోటు కల్పించారు.

Updated Date - 2022-04-11T00:23:32+05:30 IST