ఘనంగా ఏడాది పండుగ

ABN , First Publish Date - 2022-01-19T05:19:24+05:30 IST

పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద ఉన్న గ్రామదేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా ఏడాది పండుగ

నాయుడుపేట టౌన్‌, జనవరి 18 : పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద ఉన్న గ్రామదేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఏడాదిపండగను పురస్కరించుకొని పోలేరమ్మను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పట్టణంలోని మానసాదేవి,  అంకమ్మ, దుర్గాదేవి, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 సైదాపురం : మండలంలో ఏడాది పండుగ పురస్కరించుకుని గొబ్బెమ్మ పండుగలను ఘనంగా నిర్వహించారు. సైదాపురం, మొలకలపూండ్ల, తురిమెర్ల  గ్రామాల్లో గొబ్బెమ్మ ప్రతిమలకు గొబ్బిళ్లు తట్టి విశేష పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు.

చిట్టమూరు : మండలంలోని తాడిమేడు గ్రామదేవత శ్రీ మణి కేట్లమ్మకు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు.  ఏడాది పండుగ  సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి చేరుకొని దర్శం చేసుకున్నారు. గ్రామంలో మణికేట్లమ్మ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. 

బాలాయపల్లి : మండలంలోని మన్నూరు గ్రామంలో మంగళవారం కాటూరు రామతులసి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను కనులపండువగా జరుపుకున్నారు. గౌరమ్మను ప్రత్యేకాలంకరణలో సింగారించి మహిళలు గొబ్బిళ్లు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ముందుగా చిన్నారులకు ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎంపీపీ గూడూరు భాస్కర్‌ రెడ్డి  బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు బట్టేపాటి మురళీమోహన్‌ రెడ్డి, పాకపూడి సర్పంచ్‌ మల్లెమాల గోపికృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కోట : మండలంలోని తిమ్మనాయుడుపాళెంలో ఉన్న మహాలక్ష్మమ్మ, గూడలిలో ఉన్న మాతమ్మల అమ్మవార్ల ఉత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. అమ్మవార్లను విశేష అలంకా రంలో ఉంచారు. మహాలక్ష్మమ్మ, మాతమ్మ అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాలతో  ఊరేగింపు కనుల పండువగా జరిగింది. 

Updated Date - 2022-01-19T05:19:24+05:30 IST