తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి.. కొద్దిసేపటికే తలుపు తట్టిన ఆమె తమ్ముడు.. చివరకు ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2021-10-21T01:23:36+05:30 IST

ఆమెకు పట్టుమని 18ఏళ్లు కూడా లేవు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి, బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రమ్మంది. ప్రేయసి పిలవడంతో అతడు రెక్కలు కట్టుకుని ఆమె ఇంటి ముందు వాలిపోయాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి, తలుపులు వెసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోదరుడు ఇంటి తలుపు తట్టాడు. దీంతో కంగారు పడ్డ ఆ ప్రేమికులు.. ఓ షాకింగ్ నిర్ణయం తీ

తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి.. కొద్దిసేపటికే తలుపు తట్టిన ఆమె తమ్ముడు.. చివరకు ఊహించని సీన్..!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు పట్టుమని 18ఏళ్లు కూడా లేవు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి, బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రమ్మంది. ప్రేయసి పిలవడంతో అతడు రెక్కలు కట్టుకుని ఆమె ఇంటి ముందు వాలిపోయాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి, తలుపులు వెసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోదరుడు ఇంటి తలుపు తట్టాడు. దీంతో కంగారు పడ్డ ఆ ప్రేమికులు.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



నాగపూర్‌కు చెందిన ఓ యువతి గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. సోమవారం సాయంత్రం ఆమె తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో సదరు యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచింది. ప్రియురాలు నుంచి కబురు రావడంతో అతడు.. రెక్కలు కట్టుకుని ఆ యువతి ఇంటి ముందు వాలిపోయాడు. అనంతరం ఈ ప్రేమికులిద్దరూ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇది జరిగిన కొద్ది సేపటికే.. యువతి సోదరుడు వచ్చి  బయటి నుంచి తలుపు తట్టాడు. సదరు యువతి.. యువకుడితో సన్నహితంగా ఉన్న దృశ్యాలను చూసి అతడు షాకయ్యాడు. ఈ క్రమంలో తమ ప్రేమ విషయాన్ని తన సోదరు ఇంట్లో చెప్పాస్తాడనే భయంతో ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసి తమ్ముడిని హతమార్చింది. కాగా.. తమ కుమారుడు కనిపించకుండా పోయాడంటూ సదరు యువతి తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. యువతి చేసిన దారుణాన్ని బయటపెట్టారు. అనంతరం ఆ యువతిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. 




Updated Date - 2021-10-21T01:23:36+05:30 IST