ఏడాదిపాటు యథేచ్ఛగా విధ్వంసం

ABN , First Publish Date - 2020-05-31T09:05:23+05:30 IST

వైసీపీ ఏడా ది పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా శనివారం మండిపడ్డారు. ‘‘వైసీపీ పాలన కు ఏడాది పూర్తయింది. కొత్త ప్రభుత్వం, అనుభ వం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6 నెలల వరకు

ఏడాదిపాటు యథేచ్ఛగా విధ్వంసం

  • టీచర్లను కాపలాపెట్టి మరీ మద్యం అమ్మకాలు
  • దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనమేముంది?: చంద్రబాబు


అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఏడా ది పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా శనివారం మండిపడ్డారు. ‘‘వైసీపీ పాలన కు ఏడాది పూర్తయింది. కొత్త ప్రభుత్వం, అనుభ వం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6 నెలల వరకు ప్ర భుత్వానికి సహకరించాలనుకున్నాం. కానీ తొలి రో జు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించా రు. హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యా రు. నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు’’ అని ట్వీ ట్‌ చేశారు. ‘‘ఇటు న్యాయం కోసం అమరావతి ప్ర జలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉ త్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయి న నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత.. ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా? ఏం సాధించారని? ఎవరికేం ఒరగబెట్టారని? ఇకనైనా బాధ్యతగా పనిచేయండి’’ అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో... ‘‘సంపూర్ణ మద్య నిషేధానికి లాక్‌డౌన్‌ కాలం సరైనది. కానీ ఈ ప్రభుత్వం చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి మరీ మద్యం అమ్మింది. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తన ట్వీట్‌లకు ‘వన్‌ ఇయర్‌ ఆఫ్‌ మాస్‌ డిస్ట్రక్షన్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశారు.


పండుగ చేసుకోవడం శాడిజమే: లోకేశ్‌

‘‘జగన్‌ ఏడాది పాలన గురించి చెప్పాలంటే... 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్‌ ప్రభు త్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూ కబ్జాలు, కుంభకోణాలు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు...’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఓ ప్రకట నలో విమర్శించారు. వివిధ రంగాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకొన్నారనీ వివరించారు. ‘‘ఇంతమందిని నమ్మించి మోసం చేసి, బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలనంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువు తీయకుండా పాలించాలి’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


ఏడాదిలో వేలకోట్ల అప్పులు: టీడీపీ

‘‘జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలనలో కొత్తగా తెచ్చిన రూ.87 వేల కోట్ల అప్పులు... ప్రజలపై మో పిన రూ.50 వేల కోట్ల మేర ధరల భారమే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏడాదిలోనే ఇంత అప్పు చేసిన ప్రభుత్వం... ప్రజలపై ఇంత భారం మోపిన ప్రభుత్వం చరిత్రలో లేదు. దానికి సంబరాలు చేసుకోవడానికి ఆ పార్టీ అర్హమే’’ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాదిలో మద్యం ధరలు 95ు, ఇసుక ధరలు 300ు, విద్యుత్‌ బిల్లులు 300ు పెరిగాయి. మ ద్యంపై జగన్‌ ట్యాక్స్‌ వసూళ్ళు రూ.25 వేల కోట్లు. ప్రతి పథకాన్ని ఒక కుంభకోణంగా మార్చుకొని పిండుకోవడం ప్రభుత్వ ఘన విజయం. ఈ ఏడాదిలో రైతులు 480 మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 376 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఇవేనా మీ విజయాలు?’’ అన్నారు.


ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి: అయ్యన్న 

‘‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేసులో హైకోర్టు తన తీర్పుతో నియంత అయిన జగన్‌ చెంపచెళ్లు మ న్పించింది. ఇకనైనా జగన్‌ బుద్ధి తెచ్చుకుని, కళ్లు తెరిచి పాలన చేయాలి’’ అని మాజీ మంత్రి అయ్య న్న పాత్రుడు సూచించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఈసీ తొలగింపునకు తెచ్చిన ఆర్డినెన్స్‌ దస్త్రంపై గవర్నర్‌ కళ్లు మూసుకుని సంతకం చేశారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని పాలించడం అం టే జైళ్లో ఉన్నంత తేలిక కాదని జగన్‌ గ్రహించాలన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గత మార్చిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి కోరారు.

Updated Date - 2020-05-31T09:05:23+05:30 IST