పెళ్లి వేడుకలో భార్యతో తాళి కట్టించుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఏడాది తర్వాత మరోసారి హాట్ టాపిక్.. యువకులు అతడిని ఏం అడుగుతున్నారంటే..

ABN , First Publish Date - 2021-11-03T21:00:06+05:30 IST

పెళ్లి వేడుకలో భార్యతో తాళి కట్టించుకుని.. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ వ్యక్తి గుర్తున్నాడా. గుర్తుండే ఉండే ఉంటాడు లెండి. ఆయన చేసిన పని అటువంటిది మరి. భార్యతో తాళి కట్టించుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజ

పెళ్లి వేడుకలో భార్యతో తాళి కట్టించుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఏడాది తర్వాత మరోసారి హాట్ టాపిక్.. యువకులు అతడిని ఏం అడుగుతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వేడుకలో భార్యతో తాళి కట్టించుకుని.. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ వ్యక్తి గుర్తున్నాడా. గుర్తుండే ఉండే ఉంటాడు లెండి. ఆయన చేసిన పని అటువంటిది మరి. భార్యతో తాళి కట్టించుకుని ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు అతడిని అప్పట్లో ఓ ఆట ఆడుకున్నారు. ట్రోల్ చేస్తూ అప్పుడు ఆయనను ఆడుకున్న బ్యాచులర్ కుర్రాళ్లంతా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏడాది తర్వాత మరోసారి ఈ వ్యవహరం హాట్ టాపిక్‌గా మరింది. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శార్దూల్. ఏడాది క్రితం తనకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగానే అతడు తన కుటుంబ సభ్యులు సహా అందరికీ షాకిచ్చాడు. కుటుంబ సభ్యులు కాదన్నా.. భార్యతో తాళికట్టించుకున్నాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన దృష్టిలో ఆడ, మగ సమానం అని పేర్కొంటూ అందువల్లే ఈ పని చేసినట్లు వివరించాడు. ఈ క్రమంలో కొందరు అతడి నిర్ణయాన్ని ప్రశంసించగా.. మరికొందరేమో విరుచుకుపడ్డారు. ‘నీ భార్యలా నువ్వు కూడా చీర కట్టుకో.. పీరియడ్స్ తెచ్చుకో’ అంటూ శార్దూల్‌ను ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఏడాది గడిచిపోయింది. శార్దూల్ చేసిన పనిని కూడా అందరూ మరిచిపోయారు. 


అయితే శార్దూల్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో తప్పుపట్టి, ట్రోల్ చేసిన చాలా మంది అతడు చేసిన పనిని ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాకుండా శార్దూల్ వద్ద తమ సందేహం వ్యక్తం చేస్తూ.. ఆయన బదులు కోసం ఎదురుచూస్తున్నారు. ‘నీ పెళ్లి సందర్భంగా చేయించిన మంగళసూత్రం డిజైన్ చాలా బాగుంది. ఆ డిజైన్ పేరేంటి. అదెక్కడ చేయించావు’ అంటూ ప్రశ్నించడమే కాకుండా.. దీనిపై స్పందించాలని కోరుతున్నారు. దీంతో ఏడాది తర్వాత శార్దూల్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. 




Updated Date - 2021-11-03T21:00:06+05:30 IST