Abn logo
Sep 24 2021 @ 23:29PM

శ్రీశైలంలో వైసీపీ వర్సెస్‌ బీజేపీ

శ్రీశైలం పోలీస్‌ స్టేషనను ముట్టడించిన వైసీపీ నాయకులు

  1.  వైసీపీ కార్యకర్తపై బుడ్డా శ్రీకాంతరెడ్డి దాడి 
  2. పోలీస్‌స్టేషనను ముట్టడించిన వైసీపీ శ్రేణులు


శ్రీశైలం, సెప్టెంబరు 24: శ్రీశైలంలో వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య నెలకొన్న వివాదం శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. నంద్యాల లోక్‌సభ బీజేపీ ఇనచార్జి బుడ్డా శ్రీకాంతరెడ్డి ఓ వైసీపీ కార్యకర్తపై దాడికి పాల్పడడంతో వైసీపీ శేణులు శుక్రవారం శ్రీశైలం వనటౌన పోలీస్‌ స్టేషనను ముట్టడించాయి. ఇటీవల బుడ్డా శ్రీకాంతరెడ్డి శ్రీశైల క్షేత్రంలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో బుడ్డా శ్రీకాంతరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీశైలం మండల వైసీపీ నాయకుడు శంకర్‌ ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శంకర్‌ శుక్రవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్‌ వద్ద ఉన్న తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి వస్తుండగా శ్రీకాంతరెడ్డి దాడికి పాల్పడినట్లు బాధితుడు పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బుడ్డా శ్రీకాంత రెడ్డిని పోలీస్‌ స్టేషనకు పిలిపించి విచారించారు. ఈ క్రమంలోనే శంకర్‌పై దాడిని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు పోలీస్‌స్టేషనను ముట్టడించాయి. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉండ డంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైలం సీఐ బీవీ రమణ, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ వారికి సర్ది చెప్పి పంపించారు. బుడ్డా శ్రీకాంతరెడ్డిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

  శ్రీశైలంలో కుమార విహారాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు

శ్రీశైల క్షేత్రంలో శాస్త్ర విరుద్ధంగా కుమార విహారం ప్రాజెక్టు పనులను చేపడుతున్నారని నంద్యాల  పార్లమెంట్‌ బీజేపీ ఇనచార్జి బుడ్డా శ్రీకాంతరెడ్డి శుక్రవారం పనులను అడ్డుకున్నారు. శ్రీశైలం దేవస్థానం ఉభయ ఆలయాలకు ఎగువన ఏనుగుల చెరువుకట్ట సమీపంలో కుమారస్వామి ఆలయ నిర్మాణానికి ఓ సంస్థ ముందు కొచ్చింది.  దీనిపై కొందరు క్షేత్ర నిబంధనలకు విరుద్ధంగా కుమార విహారం ప్రాజెక్టును చేపడుతున్నారని న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో పనులకు బ్రేక్‌ వేయాలని న్యాయ స్థానాలు ఆదేశించిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులను చేపట్టడం ఏంటని బుడ్డా శ్రీకాంతరెడ్డి మండిపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్క డికి చేరుకొని శ్రీశకాంతరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.