YCP అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడించిన విజయసాయి

ABN , First Publish Date - 2022-07-09T21:04:01+05:30 IST

వైసీపీ (YCP) అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వెల్లడించారు.

YCP అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడించిన విజయసాయి

అమరావతి: వైసీపీ (YCP) అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) వెల్లడించారు. పార్టీ రాజ్యాంగం సవరణ ప్రతిపాదనలను ప్లీనరీలో ఆమోదించామని తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ (YSRCP)గా గుర్తించాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా సవరణ చేశామని పేర్కొన్నారు. ప్లీనరీలో జరిగిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో (elections) వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. జగన్ జీవితకాల పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటారని విజయసాయి రెడ్డి చెప్పారు.



Updated Date - 2022-07-09T21:04:01+05:30 IST