బెదిరింపులతోనే వైసీపీ విజయం

ABN , First Publish Date - 2021-02-28T05:49:07+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో ఓట ర్లను బెదిరించి వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెం కటరావు విమర్శించారు. ఎచ్చెర్లలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.

బెదిరింపులతోనే వైసీపీ విజయం
మాట్లాడుతున్న కళావెంకటరావు

 అక్రమ అరెస్టులకు భయపడేదిలేదు 

టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

ఎచ్చెర్ల/రణస్థలం, ఫిబ్రవరి 27: పంచాయతీ ఎన్నికల్లో ఓట ర్లను బెదిరించి వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెం కటరావు విమర్శించారు. ఎచ్చెర్లలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వ పథకాలను రద్దుచేస్తామని వైసీపీ నేతలు ఓటర్లను  భయపెట్టారు. పోలీసులు, ఇతర వ్యవస్థలను వినియోగించు కుని పంచాయతీ ఎన్నికలను వారికి అనుకూలంగా మార్చు కున్నారు. కొన్ని గ్రామాల్లో కౌంటింగ్‌ జరుగుతున్న సమయం లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, ఫలితాన్ని తారుమారు చేశారు. గ్రామ వలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజల మనసులో టీడీపీ పదిలంగా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకో వడం తథ్యం. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధిస్తుంది.’ అని కళావెంకటరావు తెలిపారు. 


 వైసీపీ ఆగడాలు ఎండకడతాం


అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, వైసీపీ ఆగడాలు ఎండకడతామని కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. ఇటీ వల పోలీసులు అరెస్టు చేసిన రణస్థలం మండలం కృష్ణాపురం మాజీ ఎంపీటీ సభ్యుడు ముల్లు కృష్ణను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడవద్దని, అన్నివిధాలుగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  సైనికుల్లా పనిచేసి రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు.  పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని చిట్టివలస, దేవునిపాలెం గ్రామాలకు చెందిన 30 వైసీపీ కుటుంబాలు  కళా సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో ఎచ్చెర్ల, రణస్థలానికి చెందిన నాయకులు వావిలపల్లి రామకృష్ణ, పైడి ముఖలింగం, బోర శ్రీనివాసరావు, దర్గాశి రామారావు, ఎస్‌ఎస్‌ శ్రీనివాసరాజు, సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T05:49:07+05:30 IST