Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

కర్నూలు: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుంజుకుంటోంది. టీడీపీ పుంజుకుంటోంది అనడానికి కారణం ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనం. వైసీపీకి కొన్ని చోట్లు టీడీపీ అభ్యర్థులు షాకిచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో వైసీపీకి షాకిచ్చారు. సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 వైసీపీ కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని, వైసీపీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడతారని బీసీ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.


పరిషత్‌ ఉప పోరులో టీడీపీ సత్తా చాటింది. అధికార పక్షానికి దీటుగా నిలిచింది. ఓడిన చోట్ల కూడా గణనీయంగా ఓట్లు సాధించింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బాగానే పుంజుకుంది. అమాత్యులు, కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా వ్యవహరించిన చోట మంచి ఫలితాలే సాధించి... అధికార పక్షానికి సవాల్‌ విసిరింది. టీడీపీ పుంజుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.


Advertisement
Advertisement