Abn logo
Oct 28 2020 @ 11:26AM

జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌కు బెదిరింపులు

అనంతపురం: నగరంలోని జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌పై అధికారపార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు లేకపోయినా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ హుకూం జారీ చేశారు. బకాయిలు చెల్లించమని వైస్ ఛాన్సలర్‌ శ్రీనివాస్ కుమార్‌పై రుబాబు చేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులపై వైస్ ఛాన్సలర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సదరు నేతల ఇంజనీరింగ్ కాళాశాలల్లో లోపాలు ఉన్నట్లుగా జేఎన్‌టీయూ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు.

Advertisement