‘తొమ్మిది నెలల పాలన తుస్సు!’

ABN , First Publish Date - 2020-02-20T08:45:24+05:30 IST

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎలమంచిలిలోని టీడీపీ కార్యాలయంలో

‘తొమ్మిది నెలల పాలన తుస్సు!’

ఎలమంచిలి, ఫిబ్రవరి 19 : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎలమంచిలిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సుమారు 32 వేల ఎక రాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. 

ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని, అందుకు తగ్గట్టుగా ప్రజారంజక పాలన అందించా ల్సిందిపోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాలు నిలిపి వేశారని ఎద్దేవా చేశారు. ఇందులో అన్న కాంటీన్‌ ఉదాహరణగా పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  ప్రజలు తగిన విధంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కొఠారు సాంబ, గొర్లె నానాజీ, కరణం రవి, సూర్యనారాయణ, జి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T08:45:24+05:30 IST