నెల్లూరు: నగరంలోని 50వ డివిజన్‌లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు పోలింగ్ బూతులోకి వెళ్లి, టీడీపీ ఏజెంట్లను బెదిరించాడు. దీంతో వైసీపీ తీరుపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తూ యూనిఫామ్ పరువు తీస్తున్నారని ఆరోపించారు.