కుప్పంలో వైసీపీ ఎన్నికలసభలో బూతుపురాణం

ABN , First Publish Date - 2021-11-05T20:49:13+05:30 IST

కుప్పంలో ఎన్నికల సభలో వైసీపీ నేతలు బూతుపురాణం అందుకున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కుప్పంలో వైసీపీ ఎన్నికలసభలో బూతుపురాణం

చిత్తూరు: కుప్పంలో ఎన్నికల సభలో వైసీపీ నేతలు బూతుపురాణం అందుకున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు  అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చెత్త ఊడ్చడానికి కుప్పం వచ్చావా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏం పీక్కుంటావ్‌ అంటూ చంద్రబాబుపై ఎంఎస్‌ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.


కుప్పం మున్సిపల్ ఎన్నికలతో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఇటీవలం చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన పర్యటించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం నామినేషన్‌కు చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థులను వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. శుక్రవారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.


అంతకుముందు కుప్పం మునిసిపల్ 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్‌పై దాడి జరిగింది. నామినేషన్ వేయడానికి వచ్చిన వెంకటేష్‌పై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. టీడీపీ శ్రేణులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. బాధితుడు వెంకటేష్‌ని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పరామర్శించారు. ఈ ఘటనను మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తీవ్రంగా ఖండించారు. 

Updated Date - 2021-11-05T20:49:13+05:30 IST