వైసీపీ సర్పంచి పైపులైన్‌ దురాక్రమణ

ABN , First Publish Date - 2022-01-18T04:02:15+05:30 IST

మండలంలోని పల్లిపాలెం దీవిని తలపించే గ్రామం. సముద్రానికి అరకిలో మీటరు దూరంలో ఉండే ఈ గ్రామానికి మూడు వైపులా నీరు ఉండడం ప్రత్యేకత. భూమిలో నీటి ఉప్పు శాతం 3 నుంచి 5 వరకు ఉంటుంది. అంటే దాదాపు నీరు ఉప్పుగా ఉంటుంది. దాంతో గంగపట్నం గ్రామ చెరువు నుంచి తాగునీటిని ఈ గ్రామానికి సరఫరా చేసేందుకు పంచాయతీ రోడ్డు పక్కన పైప్‌లైన్‌ వేస్తున్నారు. దీనిని అదునుగా తీసుకున్న ఆక్వా రైతు, నరసాపురం సర్పంచ్‌ సురేంద్ర అదే పైపులైన్‌ గుంతలో అక్రమ నిర్మాణానికి పూనుకున్నాడు.

వైసీపీ సర్పంచి  పైపులైన్‌ దురాక్రమణ
ప్రభుత్వ పైపులైన్‌లోనే సర్పంచ్‌ వేసిన పైపు

అక్రమంగా పైపు లైన్‌ నిర్మాణం ఫ అడ్డుకునేందుకు సిద్ధమైన ప్రజలు ఫఆపాలని  తహసీల్దారుకు ఫిర్యాదు 

ఇందుకూరుపేట, జనవరి 17 :  మండలంలోని పల్లిపాలెం దీవిని తలపించే గ్రామం. సముద్రానికి అరకిలో మీటరు దూరంలో ఉండే ఈ గ్రామానికి మూడు వైపులా నీరు ఉండడం ప్రత్యేకత. భూమిలో నీటి ఉప్పు శాతం 3 నుంచి 5 వరకు ఉంటుంది. అంటే దాదాపు నీరు ఉప్పుగా ఉంటుంది. దాంతో గంగపట్నం గ్రామ చెరువు నుంచి తాగునీటిని ఈ గ్రామానికి సరఫరా చేసేందుకు పంచాయతీ రోడ్డు పక్కన పైప్‌లైన్‌ వేస్తున్నారు. దీనిని  అదునుగా తీసుకున్న ఆక్వా రైతు, నరసాపురం సర్పంచ్‌ సురేంద్ర అదే పైపులైన్‌ గుంతలో అక్రమ నిర్మాణానికి పూనుకున్నాడు.

 సుమారు రెండు అడుగుల లోతు తీసిన గుంతలో పైప్‌లైన్‌ వేస్తున్నారు. సర్పంచ్‌ ఆ గుంతలోనే ఆరు ఇంచుల డయామీటర్‌ ఉన్న పైపులు ఏర్పాటు చేశాడు. పల్లిపాలెం గ్రామంలో  బోర్‌ పాయింట్లు వేసి  అధిక ఉప్పు శాతం ఉన్న నీటిని తాగు నీటి పైప్‌లైన్‌ పక్కనే వ్యతిరేక దిశలో వేసిన పైపుల ద్వారా ఉప్పు నీటిని గంగపట్నంలో ఉన్న రొయ్యలగుంటలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. 1.4 కిలోమీటర్లలో ప్రస్తుతం ఒక కిలోమీటరు మేర  పైపులు ఉంచి పూర్తి చేశాడు.  గంగపట్నంలో ఉన్న రొయ్యల గుంటల్లో ఉప్పు నీటిని నిల్వ ఉంచడం వల్ల గ్రామంలో భూమి లోపల ఉన్న నీరు అధిక ఉప్పు శాతానికి మారే అవకాశం కూడా ఉందని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. చెట్లు, పశువులు చనిపోయే  పరిస్థితి ఉందని  వాపోతున్నారు.అలాగే పల్లిపాలెం గ్రామంలో భూమిలోని నీటి నిల్వలు తగ్గిపోయే పరిస్థితి.  ఎన్విరాన్మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఆక్ట్‌ ప్రకారం ఉప్పు నీటిని, మంచినీటి ప్రాంతాలకు సరఫరా చేసి నిల్వ ఉంచడానికి అనుమతులు కూడా లేవు. ఈ ఆక్వా రైతు సాక్షాత్తు శ్రీచాముండేశ్వరి అమ్మవారి భూముల్లో అందునా అమ్మవారి ఆలయం వెనుక ఇంకో పైప్‌లైన్‌ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై దేవాలయ కార్యనిర్వహణ అధికారి ప్రశ్నించినా అధికార పార్టీ కావడంతో ఆయనను బెదిరించినట్టు తెలుస్తోంది. స్థానిక పైపులైన్‌ నిర్మాణానికి తహసీల్దారు అను మతులు ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం గ్రా మస్థులు ఈ పైప్‌లైన్‌ను గట్టిగా అడ్డుకోవాలని అనుకుం టున్నారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో తవ్వి తీసివేస్తామని అంటున్నారు. ఈ విషయంపై తహసీల్దారుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  లేదంటే జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-01-18T04:02:15+05:30 IST