Shadow boxing: బీజేపీపై వైసీపీ షాడో బాక్సింగ్

ABN , First Publish Date - 2022-08-04T17:46:59+05:30 IST

కేంద్రంతో ఏపీ ప్రభుత్వం (AP Govt.) షాడో బాక్సింగ్ (Shadow boxing) చేస్తోంది.

Shadow boxing: బీజేపీపై వైసీపీ షాడో బాక్సింగ్

ఢిల్లీ (Delhi): కేంద్రంతో ఏపీ ప్రభుత్వం (AP Govt.) షాడో బాక్సింగ్ (Shadow boxing) చేస్తోంది. పెరుగుతున్న ధరలు, అభివృద్ధి లేకపోవడంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ (YCP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ (BJP)తో అంటకాగిన వైసీపీకి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లుంది. పెరుగుతున్న ధరలతోపాటు.. అభివృద్ధిలేని కారణంగా ప్రజల నుంచి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.


గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తున్నారు. అందుకే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కేంద్రం వైపు మళ్లించాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేనిది.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై వైసీపీ ఎంపీలు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకన్నా తీవ్రంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.


ప్రధాని మోదీ, అమిత్ షాల మెప్పు పొందేందుకే ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకున్న వైసీపీ ఎంపీలు సడన్‌గా ఇప్పుడు ఎంపీలు తమ స్వరాన్ని సవరించుకున్నట్లు అనిపిస్తోంది. అయితే ఈ స్వర సవరణ వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటన్నదానిపైనే ఢిల్లీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజంగానే బీజేపీపై వైసీపీ యుద్ధాన్ని ప్రకటించిందా? లేక షాడో బాక్సింగ్ చేస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక హోదాతోపాటు ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కినా.. ఇప్పటి వరకు వైసీపీ నోరు మెదపలేదు. ఒక విధంగా చెప్పాలంటే తనపై ఉన్న కేసుల నుంచి జగన్ బయటపడేందుకు రాష్ట్ర భవిష్యత్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారా అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే వైసీపీ నేతల వైఖరి ఉంది.

Updated Date - 2022-08-04T17:46:59+05:30 IST