వైసీపీ రాసలీలల పార్టీ

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించిన ఆయన, సిగ్గులేకుండా తమ పార్టీపైన, కమ్మ కులంపైన, మీడియాపైన దూషణలకు దిగారని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

వైసీపీ రాసలీలల పార్టీ
ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నేతలు

గోరంట్ల మాధవ్‌కు సిగ్గులేదు

వైసీపీ నుంచి బహిష్కరించాలి

నగ్నంపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

అనంతపురం అర్బన, ఆగస్టు 5: ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించిన ఆయన, సిగ్గులేకుండా తమ పార్టీపైన, కమ్మ కులంపైన, మీడియాపైన దూషణలకు దిగారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో శుక్రవారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనలో పాల్గొన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పార్టీ ముఖ్యనాయకులు పలువురు టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ రాసలీలల పార్టీగా మారిందని టీడీపీ కళ్యాణదుర్గం ఇనచార్జి ఉమామహేశ్వర నాయుడు విమర్శించారు. అవినీతితో మొదలైన వైసీపీ.. రాసలీలల పార్టీగా మారిందని, మునుముందు ఇంకా ఏమౌతుందో తెలియడం లేదని అన్నారు. గోరంట్ల మాధవ్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదని అన్నారు.

- గౌరవప్రదమైన పదవిలో ఉంటూ, సభ్యసమాజం తలదించుకునేలా మాధవ్‌ వ్యవహరించారని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు తెచ్చామని వైసీపీ నాయకులు గొప్పగా చెబుతారని, కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో 86 మంది నాయకులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ, మీడియాపై మాధవ్‌ నోరుపారేసుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకే్‌షపై అవాకులు చవాకులు పేటడం, కమ్మ కులంవారు కుట్ర పన్నారని సిగ్గులేకుండా మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.

- వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వికృత చేష్టలు కోట్లాది మంది ప్రజలు చూసి తిట్టుకుంటున్నారని అన్నా రు. ఆయన పోలీసు అధికారిగా పనిచేసే సమయంలోనే ఇలాంటి వ్యవహారాలు చేసేవారని ఆరోపించారు. ఎంపీ పదవి నుంచి ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా అధ్యక్షుడు ధనుంజయనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి సాకే వీరాంజినేయులు, పార్టీ నాయకులు అనిల్‌కుమార్‌, రామాంజినేయ నాయక్‌, రాజే్‌షనాయక్‌, లోకేష్‌, చినరాయు డు, పెద్దన్న, నవీన, చిరంజీవి, వెంకట్‌నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు. 



బీసీ కులహీనుడు మాధవ్‌: పోతులయ్య

అనంతపురం అర్బన, ఆగస్టు 5: ఎంపీ గోరంట్ల మాధవ్‌ బీసీ కుల హీనుడని కుమ్మర శాలివాహన సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ పోతులయ్య మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లా బీసీలంటే ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌరవం ఉందని అన్నారు. ఏ పార్టీలో పనిచేసినా చిత్తశుద్ధితో పనిచేస్తారని అన్నారు. బీసీ కులానికి చెందిన మాధవ్‌ను హిందూపురం ఎంపీగా ప్రజలు గెలిపిస్తే, వారి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి వికృత చేష్టలతో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారని విమర్శించారు. బీసీ కులం నుంచి ఆయన్ను బహిష్కరించాలని, జిల్లా నుంచి తరిమేయాలని అన్నారు. ఎంపీ పదవిలో ఉండేందుకు ఆయనకు అర్హత లేదని అన్నారు. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసి, ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వెంకట్‌, కురబ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గంగులకుంట రమణ, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ విశాలాక్షి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు పాల్గొన్నారు. 



నాలుక కోస్తా.. మాధవ్‌: చంద్రదండు ప్రకా్‌షనాయుడు

అనంతపురం అర్బన, ఆగస్టు 5: ‘నీ వికృత చేష్టలు బయటపెడితే నోటికొచ్చినట్లు మాట్లాడుతావా...? మరోసారి ఇ లా నోరుపారేసుకుంటే నాలుక  కోస్తా’ అని ఎంపీ గోరంట్ల మా ధవ్‌ను చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు హెచ్చరించారు. మీడియా యా జమాన్యం, టీడీపీ, కమ్మ సామాజికవర్గంపై నోరుపారేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా గలీజు వ్యవహారం చేసేందుకేనా ప్రజలు నిన్ను ఎంపీగా ఎన్నుకున్నది అని  నిలదీశారు. ఎంపీ మాధవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నగరంలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రకా్‌షనాయుడు ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు. మాధవ్‌ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు వీల్లేదని హెచ్చరించారు. అయితే, తాము ముట్టడించి తీరుతామని ప్రకా్‌షనాయుడు, చంద్రదండు సభ్యులు స్పష్టం చేశారు.  దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించారు. అందరినీ అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషనకు తరలించారు. 


మాధవ్‌ ఇంటికి పోలీసు భద్రత

అనంతపురం క్రైం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇంటి వద్ద పోలీసులు మోహరించాయి. ఎంపీ మాధవ్‌ నగ్న వీడియా వెలువడిన నేపథ్యంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో ఎంపీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎంపీ ఇంటిపై  దాడులు చేస్తాయనే ఉద్దేశంతో పోలీసులు ముందుజాగ్రత్తగా భద్రత ఏర్పాటు చేశారు. రామ్‌నగర్‌ 80 అడుగుల రోడ్డులోని మాధవ్‌ నివాసం ఎదుట పోలీసులు భదత్ర ఏర్పాటు చేశారు. ఏబీఎన-ఆంధ్రజ్యోతిలో ఎంపీ న్యూడ్‌ వీడియో గురువారం ప్రసారం అయింది. అప్పటి నుంచి ఎంపీ ఇంటిలో ఎవరూ కనిపించడం లేదు.

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST