వైసీపీలో ప్రమాణాల రాజకీయం

ABN , First Publish Date - 2021-06-20T06:13:22+05:30 IST

అవసరాలకు అనుగుణం గా కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు నా యకులు పార్టీ ఫిరాయింపు రాజకీయలు చే స్తున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు సరికొత్త రాజకీయానికి శ్రీ కారం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామంటూ దేవాలయంలోని గర్భగుడిలోనే ప్రమాణం చేస్తేనే ప్రాధాన్యత అంటూ మె లికపెట్టారు.

వైసీపీలో ప్రమాణాల రాజకీయం
ఆలయంలో కృష్ణచైతన్య సమక్షంలో ప్రమాణం చేస్తున్న రెండు వర్గాల నాయకులు

మామిళ్లపల్లి బ్రహ్మంగారి గుడిలో శ్రీకారం

నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య సరికొత్త వ్యవహారం


అద్దంకి, జూన్‌ 19: అవసరాలకు అనుగుణం గా కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు నా యకులు పార్టీ ఫిరాయింపు రాజకీయలు చే స్తున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు సరికొత్త రాజకీయానికి శ్రీ కారం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామంటూ దేవాలయంలోని గర్భగుడిలోనే ప్రమాణం చేస్తేనే ప్రాధాన్యత అంటూ మె లికపెట్టారు. అంతకు మించి పార్టీలో పాత, కొ త్త కలయికకు కూడా దైవప్రమాణాల బలహీన తను సొమ్ము చేసుకుంటున్నారు. అందుకు ని యోజకవర్గంలోని సంతమాగులూరు మండ లం మామిళ్ళపల్లిలో శనివారం జరిగిన ఘటన ను ఉదాహరణ. సాఽక్షాత్తు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కృష్ణచైతన్య సమక్షంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మొన్నటి ఎన్నికల్లో  గెలుపొందిన సర్పంచ్‌ కుమారుడు సుబ్బారావు వైసీపీకి నాయకత్వం వహిస్తున్నాడు. గత అసె ంబ్లీ ఎన్నికల్లో ఈ పంచాయతీలో టీడీపీకి సు మారు 750ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో కృష్ణ చైతన్య గ్రామంలోని టీడీపీ ఓట్లపై దృష్టిసారిం చారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పక్షాన నాయకత్వం వహించిన వెలుగొండ రాయుడు, దావులూరు శ్రీనివాసరావు వర్గాలను దగ్గరకు తీశారు. సహజంగానే దీనిపై వైసీపీ వ ర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కృ ష్ణచైతన్య దైవ ప్రమాణాల రాజకీయానికి తెర తీశారు. తదునుగుణంగా ఇరుగ్రూపుల వారితో మాట్లాడి దైవసాక్షిగా వారంతా వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చేవిధంగా దైవప్రమాణం చేయించేందుకు ఒప్పించారు. మామిళ్ళపల్లిలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం అంటే అపార మైన భక్తి. గ్రామంలో ఎప్పుడు ఏది జరిగినా ఆ దేవాలయంలోనే పంచాయతీ నిర్వహించి ప్ర మాణాలు చేయిస్తారు. ప్రస్తుతం కూడా వైసీ పీలోని ప్రస్తుత సర్పంచ్‌ వర్గం, టీడీపీ పక్షం నుంచి కొత్తగా చేరుతున్న వర్గం ఆ దేవాలయం లో చేరారు. దైవసాక్షిగా వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో కృష్ణచైతన్యకే తాము ఓటు వేయడంతోపా టు తమ వర్గీయులతోను వేయిస్తామని ప్రమా ణం చేశారు. వెంటనే చైతన్య జోక్యం చేసుకొని వ్యక్తికి కాకుండా వైసీపీకి ఓటు వేస్తామని ప్ర మాణం చేయమని కోరటంతో తిరిగి ఆ రకమై న ప్రమాణాన్ని ఇరుపక్షాల నాయకులు చేశా రు. మరి నిజానికి వారు ఆ ప్రమాణంపై నిలు స్తారా, వారు నిలిచినా కిందిస్థాయిలోని వారి వర్గంలో ఉన్న ప్రజానీకం వారి బాటలో నడు స్తారా అన్నది వేచిచూడాల్సి ఉంది. 


Updated Date - 2021-06-20T06:13:22+05:30 IST