YCP ప్లీనరీ ప్రారంభం... వేదికపైకి చేరుకున్న Jagan, విజయమ్మ

ABN , First Publish Date - 2022-07-08T17:26:08+05:30 IST

జిల్లాలో వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశాలు ప్రారంభమయ్యాయి.

YCP ప్లీనరీ ప్రారంభం... వేదికపైకి చేరుకున్న Jagan, విజయమ్మ

గుంటూరు:  జిల్లాలో వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy), పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ (Vijayamma) ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. జగన్, విజయమ్మ ఒకే వాహనంలో ప్లీనరీ ప్రాంగణానికి వచ్చారు. ముందుగా వైదికపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS rajashekar reddy) విగ్రహానికి జగన్ పూలమాల వేసి, ఆకుపచ్చకండువా కప్పి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ప్లీనరీ ప్రాంగణం పార్టీ నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. 


మరోవైపు ప్లీనరీ ఏర్పాట్ల కోసం 20 కమిటీలను సీఎం నియమించారు. తొలిరోజు ప్రతినిధుల సభ.. రెండోరోజు విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్లీనరీలో చర్చ జరుగనుంది. రానున్న ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 

Updated Date - 2022-07-08T17:26:08+05:30 IST