వైసీపీ ఆగడాలు..!

ABN , First Publish Date - 2021-03-02T07:19:11+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రాయదుర్గంలో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని టార్గె ట్‌ చేశారు.

వైసీపీ ఆగడాలు..!
శాఖాధికారులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థినికి బెదిరింపులు

పార్టీలో చేరాలని వారం నుంచి ఒత్తిడి

ససేమిరా అన్నందుకు కలపకోత యంత్రం సీజ్‌

ఆందోళనకు దిగిన తెలుగు తమ్ముళ్లు


రాయదుర్గం టౌన, మార్చి 1: మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రాయదుర్గంలో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని టార్గె ట్‌ చేశారు. టీడీపీ తరపున పోటీ నుంచి తప్పుకుని, వైసీపీలో చేరాలని హుకుం జారీ చేశారు. మాట వినకుంటే కలప కోత యంత్రాన్ని సీజ్‌ చే యిస్తామని బెదిరించారు. ససేమిరా అనటంతో అనుకున్నంత చేసేశారు. అటవీ శాఖాధికారులతో దాడులు చేయించి, ఏళ్లుగా నడుపుతున్న కలప కోత యంత్రాన్ని సీజ్‌ చేయించారు. వైసీపీ నేతలు తలచుకుంటే ఎంతటి దురాగతానికైనా ఒడిగట్టగలరనటానికి ఇది నిదర్శనం. కలప కోత యంత్రా న్ని సీజ్‌ చేయటంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.


      మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న అశ్విని కుటుంబానికి చెందిన కలపకోత యంత్రాన్ని అటవీ శాఖాధికారులు సోమవారం సీజ్‌ చేశారు. యంత్రానికి సంబంధించిన చక్రాలను తొలగించి, తరలించేందుకు ప్రయత్నించటంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. అటవీ శాఖాధికారులు కోత యంత్రానికి అనుమతులు లేవని ఫిర్యాదు అం దటంతో తనిఖీలకు వచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకు న్న పట్టణంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి, ఆం దోళనకు దిగారు. అభ్యర్థి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.  దాదాపు 13 కలపకోత యంత్రాలుండగా టీడీపీ నాయకుడికి సంబంధించి న సామిల్‌నే లక్ష్యంగా చేసుకుని, అటవీ శాఖాధికారులు దాడులు చేసి, సీ జ్‌ చేయటం సరికాదని అటవీ శాఖాధికారితో వాగ్వాదానికి దిగారు. అటవీ శాఖాధికారి శ్రీరాములు తీరుపై మండిపడ్డారు. పట్టణంలో చాలా కలపకో త యంత్రాలుండగా టీడీపీ నాయకునికి సంబంధించిన వ్యాపార సంస్థపై దాడులు చేసి, వేధించటం సరికాదని వాదనకు దిగారు. రోజూ ట్రాక్టర్లలో అక్రమంగా కలప, వేప, చింతచెట్లు తరలించి, సొమ్ము చేసుకుంటున్న వారి పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ నిలదీశారు. రాజకీయ కక్షతో నే ఉన్నట్లుండి అధికారులు దాడికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. వైసీపీలో చేరితే ఇవన్నీ మూసుకుపోతాయని ఎద్దేవా చేశారు. అక్రమం గా కలప, చింత చెట్లను నిల్వ చేసిన స్థావరాలను తామే స్వయంగా చూపిస్తామనీ, చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ ఎదురుదాడికి దిగారు. దీం తో అటవీశాఖాధికారి శ్రీరాములు మిన్నకుండిపోయారు.


పార్టీ మారి, పోటీ నుంచి తప్పుకోవాలి..


తెలుగుదేశం పార్టీ తరపున పోటీని ఉపసంహరించుకుని, వైసీపీలో చే రాల్సిందిగా వారం రోజులుగా తనపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు అ భ్యర్థిని తండ్రి కరెన్న ఆరోపించారు. ఆయన అధికారులతో మాట్లాడుతూనే విలేకరుల ముందు ఏకరువు పెట్టారు. తనను వైసీపీ నాయకులు వారం రోజులుగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లొంగకపోతే కలప కోత యంత్రంపై అధికారులతో దాడులు చేయించి, మూసి వేయిస్తామ ని హెచ్చరించారన్నారు. చెప్పినట్లుగానే సోమవారం అధికారులు వచ్చి, దా డులు చేసి సీజ్‌ చేశారన్నారు. 50 ఏళ్లుగా తన తాతముత్తాతల నుంచి కా ర్పెంటర్‌ వృత్తినే నమ్ముకుని, జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అధికార పా ర్టీ బెదిరింపులకు లొంగకపోవటంతో తన వ్యాపారాన్ని మూయించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డాడు. సామాన్యులు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తన పొట్ట కొట్టేందుకు ప్రయత్నించటం దారుణమన్నారు. అధికార పార్టీ ఆగడాలకు ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు.


ఫారమ్‌-2 అనుమతి లేనందుకే..

సామిల్‌కు సంబంధించి ఫారమ్‌-2 అనుమతి లేనందుకే సీజ్‌ చేస్తున్న ట్లు అటవీ శాఖాధికారి శ్రీరాములు తెలిపారు. ఆయన విలేకరులతో మా ట్లాడారు. చాలా ఏళ్లుగా సామిల్‌ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పుడు తమకు ఫి ర్యాదు అందిందన్నారు. దరఖాస్తు చేసుకుంటే అనుమతి వస్తుందని స్పష్టం చేశారు. సీజ్‌ చేయటమే కాకుండా అందులోని యంత్రాలను తీసుకెళ్లే అధికారం తమకుందన్నారు. అందుకే తీసుకెళ్తున్నామన్నారు. 15 రోజులు గడువిస్తామనీ, ఆలోపు అనుమతులు తీసుకురావాలన్నారు.

Updated Date - 2021-03-02T07:19:11+05:30 IST