తిరుపతిలో హింసకు వైసీపీ ప్లాన్: పట్టాభి

ABN , First Publish Date - 2021-03-05T22:51:47+05:30 IST

నగరంలో జరుగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో

తిరుపతిలో హింసకు వైసీపీ ప్లాన్: పట్టాభి

 తిరుపతి: నగరంలో జరుగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో హింసకు పాల్పడడానికి అధికార వైసీపీ ప్రణాళిక చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమన కరుణాకర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేనే టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేయించారని ఆయన ఆరోపించారు. ఏకగ్రీవాల కోసం ఇంత నీచస్థాయికి దిగజారుతారా అని పట్టాభి వైసీపీ నేతలను దుయ్యబట్టారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లు లేకుండా చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని పట్టాభి ఆరోపించారు. 



మున్సిపల్ ఎన్నికలు తిరుపతిలో కాకరేపుతున్నాయి. మేయర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని అధికారపార్టీ వైసీపీ విశ్వాసంతో ఉంది. అయితే నామినేషన్లు వేయకుండా బలవంతపు ఏకగ్రీవాలపై ప్రతిపక్షం గుర్రుగా ఉంది. తిరుపతిలో పురపోరు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.


తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఇందులో 25 ఎవరు గెలిస్తే వారిదే మేయర్ స్థానం. అధికార వైసీపీ ఇప్పటికే 16 ఏకగ్రీవాలు చేసుకుంది. మరో 8 నామినేషన్లను బలవంతంగా విత్ డ్రా చేయించింది. అంటే దాదాపు 24 డివిజన్లను కైవశం చేసుకుంది. ఇక ఒక్కటి గెలిస్తే చాలు.. మేయర్ పదవి వైసీపీకే. ఇదే నమ్మకంతో వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మేయర్ పీఠం మాదేనంటూ విజయగర్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

Updated Date - 2021-03-05T22:51:47+05:30 IST