Abn logo
Aug 6 2020 @ 18:14PM

అమరావతి విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసింది: గద్దె రామ్మోహన్‌

అమరావతి: అమరావతి విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసిందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థాయి లేదని మాట్లాడటానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. పక్కనే ఉన్న రాజధాని విశాఖ వెళ్లిపోతుంటే చోద్యం చూస్తున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం జగన్ ముందుకెళ్లి అభిప్రాయం చెప్పలేరని ఎద్దేవాచేశారు. జగన్‌ తానా అంటే...మంత్రులు తందానా అంటున్నారని, సీఎంకు వాస్తవ పరిస్థితి వివరించలేని దుస్థితిలో మంత్రులున్నారని విమర్శించారు. జగన్ తుగ్లక్ నిర్ణయాల‌ వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని, ప్రజలు విధించే శిక్షకు త్వరలో జగన్‌ అడ్రస్ లేకుండా పోతారని గద్దె రామ్మోహన్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement