Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్లీనరీలు.. ‘పీడకలే’

twitter-iconwatsapp-iconfb-icon
ప్లీనరీలు.. పీడకలే

  • జిల్లాలో వైసీపీకి పీడకలలా మారిన నియోజకవర్గ ప్లీనరీలు
  • గడపగడప తరహాలోనే సభల్లో ఎమ్మెల్యేలకు నేతలు, కార్యకర్తల నిలదీతలు
  • మూడేళ్లనుంచి ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ క్యాడర్‌ రుసరుసలు
  • తమ కంటే వలంటీర్లకే పార్టీ విలువ ఇస్తోందంటూ కస్సుబస్సులు
  • ప్లీనరీల ద్వారా బయటపడ్డ పార్టీలో అంతర్గత విభేదాలు, గ్రూపులు
  • పెద్దాపురంలో అసమ్మతికాక నుంచి తప్పించుకునేందుకు కాకినాడలో సభ
  • ఎమ్మెల్యే తమకు తప్పించి అందరికీ పనిచేస్తున్నారంటూ జగ్గంపేటలో గగ్గోలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఒకపక్క ప్రజలు, మరోపక్క క్యాడర్‌ ఎక్కడికక్కడ పార్టీపై గుర్రుగా ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పడిపోతు న్న గ్రాఫ్‌ను చూసి అయోమ యానికి గురవుతోంది. మున్ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తల్చుకుని బెంగపడుతోంది. సంక్షేమ పథకాల పేరుతో ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామంటూ చంకలు గుద్దుకుంటున్న నేతలకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమాత్రం మింగుడు పడనీయడంలేదు. మొన్నటి వరకు గడపగడపలో జనం నిలదీతలు, నిరసనలతో పార్టీ పరువు బజారున పడగా, ఇప్పుడు నియోజకవర్గాల ప్లీనరీల్లో ఏకంగా సొంత పార్టీ నేతలు, క్యాడర్‌ నుంచే ఛీత్కారాలు, చేదు అనుభవనాలు ఎదురవడంతో ఎమ్మెల్యేలకు ఏంపాలుపోని పరిస్థితి ఎదురవుతోంది. మూడేళ్లుగా తమను కనీసం పట్టించు కోకుండా ఇప్పుడు మీటింగ్‌ అవసరాలకు పిలుస్తారా? అని కొందరు, పార్టీ జెండా మోసిన వారిని వదిలేశారని మరికొందరు కడిగేయడంతో ప్లీనరీలు సదరు నేతలకు పీడకలగా మారాయి.

మామూలుగా లేదు మరి

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన ఆనందం ఆ పార్టీ నేతల్లో ఎక్కడా కనిపించ డం లేదు. క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదంటూ ఇన్నాళ్లు నమ్మతూ వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలకు క్రమేపీ అసలు తత్వం బోధపడుతోంది. నియోజకవర్గాల్లో అనుకున్నంత పరిస్థితులు ఏమీ బాగా లేవని అర్థం అవుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లుగా పిసరంతైనా అభివృద్ధి చేయ కపోయినా పథకాల పేరుతో జనం ఖాతాల్లో డబ్బులు వేయడంతో గ్రాఫ్‌ బాగుందనే గుడ్డి నమ్మకం ఇప్పుడు పటాపంచలవుతుండడంతో మింగలేక కక్కలేకపోతున్నారు. మూడేళ్లపాటు జనానికి దూ రంగా ఉండి గత నెల్లో గడపగడప కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేలు జనం తమకు నీరాజనాలు పలుకుతారని భ్రమపడితే నిరసనలు, నిలదీతలో చుక్కలు చూపించారు. రహదారులు, కార్డులు, పింఛన్లు, ఇంటిపన్ను, చెత్తపన్ను, వేధింపులు, ఓటీఎస్‌ ఇలా ఒకటేంటీ అనేక విషయాల్లో ప్రభు త్వంపై ప్రజల్లో అసంతృప్తి సెగ ఎమ్మెల్యేలకు నేరుగా తాకింది. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులతో సదరు నేతలకు కంటిపైకునుకు లేకుండా పోయింది. ఈ చేదు అనుభవాలతో జాగ్రత్తలు పడ్డ ఎమ్మెల్యేలు పోలీసులు, అధికారులు, పార్టీ కార్యకర్తల సాయంతో ఏదోలా ఈ కార్యక్రమాన్ని ఈడ్చు కొస్తున్నారు. ఇంతలో మూడేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహిం చాలని ఎమ్మెల్యేలను గత నెల్లో అధిష్ఠానం ఆదేశించింది. ఇప్పుడు ఇవి కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు పీడకలల్లా మారాయి. అసలే జనం నిలదీతలతో తలబొప్పికడితే ఇప్పుడు నియోజకవర్గ ప్లీనరీల్లో ను అంతకుమించి అసమ్మతి, ఆగ్రహావేశాలు, ఆక్రోశాలు పార్టీ నేతలు, క్యాడర్‌నుంచి వ్యక్తమవు తుండడంతో తలబాదుకుంటున్నారు. మా అవసరం ఇప్పుడు వచ్చిందా అంటూ నియోజకవర్గాల్లో నేతలు ఎదురు తిరగడం చూసి కంగుతింటున్నారు. మాకంటే వలంటీర్లే ఎక్కువ కదా వాళ్లతో పని చేయించుకోండి అంటూ చెప్పడంతో పరిస్థితులు వీరిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకోసం అసలు క్యాడర్‌ పనిచేస్తారా? లేదా? అనే అనుమానాలు పెరిగిపోయాయి.

వాళ్లతోనే పనిచేయించుకోండి

పిఠాపురంలో ఈనెల 27న నిర్వహించిన ప్లీనరీలో ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పార్టీ నేతలు, క్యాడర్‌ చుక్కలు చూపించారు. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి మూడేళ్ల తర్వాత తాము గుర్తుకు వచ్చామా? అని కార్యకర్తలు నిలదీశారు. పార్టీ జెండా మోసిన వాళ్లకు ఇంతకాలం ఏంచేశారని మండిపడ్డారు. గ్రామాల్లో వలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. అన్ని పనులు వలంటీర్లతోనే చేసుకుంటే తాము ఎందుకని ప్రశ్నించారు. పార్టీ కమిటీలు కూడా వాళ్లతోనే వేసుకోండంటూ నిప్పులు చెరిగారు. దీంతో ఎమ్మెల్యేకు అసంతృప్తి సెగలు గట్టిగానే తగిలాయి. కాకినాడ ప్లీనరీలో క్యాడర్‌ ద్వారంపూడిపై కస్సుమన్నారు. అన్ని పనులు వలంటీర్లతోనే చేయించుకోండి.. మేమెందుకు అని తెగేసి చెప్పేశారు. జగ్గంపేట ప్లీనరీ గండేపల్లిలో జరపగా పనులన్నీ తమకు తప్పించి ఎమ్మెల్యే చంటిబాబు మిగిలిన వారందరికి చేస్తున్నారని, ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. కాకినాడ రూరల్‌ ప్లీనరీ అయితే వ్యతిరేకవర్గం రాకుండా జాగ్రత్తలు తీసుకుని స్పందన ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. నిలదీతలు తప్పించుకోవడానికి కేవలం తమకు అనుకూలమైన నేతలు, క్యాడర్‌తో మమ అనిపించేశారు.

పరువుతీసిన ఆ పోలిక

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత తీరుపై క్యాడర్‌ గుర్రుగా ఉన్న విషయం ప్లీనరీతో మరోసారి బయటపడింది. తమకు విలువ లేకుండా పూచికపుల్లగా మార్చేశారని పలువురు నేతలు ప్లీనరీలో అంతర్గతంగా గళం విప్పారు. ఇదే సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడుకు ఇప్పుడు పులి వచ్చిందని, కానీ ఇంకో పులి మూడేళ్ల కిందటే వచ్చిందంటూ పర్వతప్రసాద్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో మరుసటిరోజు పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పర్వతను ఆడేసుకున్నారు. ఆయన్ను క్రూరమృగంతో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ నిజమే చెప్పారంటూ గుసగుసలాడుకున్నారు. పెద్దాపురం ప్లీనరీ మరీ దారుణం. ఇప్పటికే అసమ్మతి తలపోటుతో విల విల్లాడున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొరబాబు నియోజకవర్గానికి దూరంగా కాకినాడ లక్ష్మి పరిణయ హాల్లో సమావేశం నిర్వహించారు. అసంతృప్తి, అసమ్మతి వాదులను రాకుండా కట్టడి చేశారు. అసంతృప్త నేతలను ఇంటికి పిలిపించుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారన్న విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబువద్ద ప్రస్తావిస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. నియోజకవ ర్గాల్లో ప్లీనరీలు వైసీపీ ఎమ్మెల్యేలకు పీడకలగా మారాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.