తెంపల్లిలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
గన్నవరం, మే 17: వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలా పాలయ్యారని టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. మండలంలోని తెంపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం-బాదుడే బాదుడే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ పాలన వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రజల భవిష్యత్‌కు టీడీపీ భరోసాగా ఉందన్నారు. ప్రజలకు పెరిగిన ధరలను వివరిస్తూ కరపత్రాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు జొన్నలగడ్డ సుధాకర్, వీర్ల రాంబాబు, జొన్నలగడ్డ రంగమ్మ, మోదుగుమూడి సత్యనారాయణ, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, నిమ్మకూరి మధు, మేడేపల్లి రమ, చిక్కవరపు నాగమణి, గరిమెళ్ళ నరేంద్ర చౌదరి పాల్గొన్నారు.