పేదల కడుపు కొడుతున్న వైసీపీ

ABN , First Publish Date - 2022-06-25T06:19:11+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పన్ను బాదుడుతో మధ్యతరగతి ప్రజలను భయందోళనకు గురిచేస్తోందని మాజీ శాసన సభ్యలు కందులనారాయణరెడ్డి అన్నారు.

పేదల కడుపు కొడుతున్న వైసీపీ
రాస్తారోకో చేస్తున్న కందుల నారాయణరెడ్డి

టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి

పింఛన్ల తొలగింపునకు నిరసనగా  రాస్తారోకో

పొదిలి రూరల్‌, జూన్‌ 24 : వైసీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పన్ను బాదుడుతో మధ్యతరగతి ప్రజలను భయందోళనకు గురిచేస్తోందని మాజీ శాసన సభ్యలు కందులనారాయణరెడ్డి అన్నారు.  మండలంలోని కంభాలపాడు గ్రామంలో శుక్రవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కంభాలపాడు గ్రామంలో 16 మంది చర్మకారులు ఉంన్నారన్నారు. వారిలో 16 మందికి కరెంట్‌ బిల్‌ ఎక్కువ చూపించి వారి పింఛన్‌ తొలగించారని ఎద్దేవ చేశారు. పూరిగుడిసెలో ఉంటున్న వ్యక్తికి రూ.23 వేలు కరెంట్‌ బిల్లు రావడం ఏమిటని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో అన్ని ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదోఒక సాకుతో వాటిని తొలగిస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని  విమర్శించారు. పంటలబీమా విషయంలో  పొలం ఉన్నవారికి రాకుండా, జగనన్న కాలనీలను సాగు భూములుగా చూపించి లక్షల రూపాయల బీమా సొమ్మును వైసీపీ నాయకులు దోచుకున్నారన్నారు.   గ్రామాల్లో వైసీపీ నాయకులు గుండాల్లాగా పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.  దమ్ము ధైర్యం ఉంటే టీడీపీని ఎదుర్కోవాలని, పేద ప్రజలనోరు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీని చూసి వైసీపీ నాయకులు భయానికి గురై కార్యకర్తలను బెదిరిస్తున్నార న్నారు.  అక్రమ కేసులు బనాయి స్తున్నారని మండిపడ్డారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమని తప్పు చేసిన  వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. అధికారు ల్లోనూ అవినీతి పెరిగిందని దీన్ని అడ్డుకట్ట వేయాల న్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్రకారదర్శి అనిల్‌, జిల్లా నాయకులు గౌస్‌, పట్టణ అధ్యక్షులు ఖుధ్ధూష్‌, మాజీ సర్పంచ్‌ చినబాబు, ఎస్‌స్సిసెల్‌ పొదిలి మండల అధ్యక్షులు వై.నాగేశ్వరావు(ఠాగూర్‌), నాయకులు కాటూరి శ్రీను, పలువురు టీడీపి కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

కొమరోలు : జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలకు హద్దులు లేదని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి అన్నారు. మండలంలోని యర్రపల్లి గ్రామంలో బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ముందుగా ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ చార్జీలు, విద్యుత్‌ కోతలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వం విపరీతంగా నిత్యవసర సరుకులు, విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు, ఇసుక వంటివి పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకాన్ని అందించాల్సి ఉండగా వివిధ కారణాలు చూపి కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీవీ.రాఘవరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు  బోనేని వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి, మండల నాయకులు, మాజీ సర్పంచ్‌ తిరుమలరెడ్డి, వీరనారాయణరెడ్డి, భాస్కర్‌, ఇబ్రహీం, రమేష్‌, సురేష్‌, రమణయ్య, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తర్లుపాడు : రైతులను దగా చేసిన వైసీపీ ప్రభు త్వానికి పుట్టగతులుండవని మార్కాపురం మాజీ శాసన సభ్యుడు కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కలుజువ్వలపాడులో బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచిన ధరలకు వ్యతి రేకంగా నినాదాలు చేస్తూ, వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నా యన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలకు పెనుభారం మోపారన్నారు. 2021 ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోయి రైతులకు లక్షలాది రూపాయలు నష్టపోతే తర్లుపాడు మండలంలోని రైతులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక కలుజువ్వలపాడులో 450 మంది రైతులు కంది పంటను సాగు చేస్తే కేవలం 67 మంది రైతులకు మాత్రమే పంటల బీమా పథకం బీమా వర్తించడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయార న్నారు. విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగిస్తూ, రైతులకు ఉరితాళ్లు బిగించిందన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గుండాయిజం, భూకబ్జాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఆర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు సాదం వీరయ్యయాదవ్‌, గోపినాథ్‌ చౌదరి, టీడీపీ నాయకులు ఈర్ల వెంకటయ్య, కందుల చిట్టిబాబు, నాలి బాలయ్య యాదవ్‌, కె.అచ్చిరెడ్డి, కె.కాశిరెడ్డి, మందా వెంకటరెడ్డి, వై.వెంకటసుబ్బారెడ్డి, పి.వెంకటేశ్వరరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

బేస్తవారపేట : టీడీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆ ఆభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లాల్సిన సమయం వచ్చిందని టీడీపీ మండల అఽధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో  నిత్యవసరాలు, విద్యుత్‌ తదితర వాటిని అధిక ధరలు పెంచడంతో ప్రజలపై ఆర్థిక భారం మోపిన ఘనత వైసీపీకే దక్కిందని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తముల అశోక్‌రెడ్డి అదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పిటికాయగుళ్ల గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.  వైసీపీ పాలలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో  నర్ర అంకిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చేగిరెడ్డి పోతిరెడ్డి, పాల పోతిరెడ్డి, పేరూరి సుబ్బయ్య, నర్రా వెంకటరెడ్డి, బోరెడ్డి కాశిరెడ్డి, రాచకొండ శివయ్య, పేరూరి చిన్న రంగయ్య, దూదెకుల సైదులు, ముప్పూరి రాము,సందు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:19:11+05:30 IST