సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2022-06-30T05:16:04+05:30 IST

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
ఫిరంగిపురంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతున్న మేకతోటి సుచరిత

మాజీ హోంమత్రి మేకతోటి సుచరిత

ఫిరంగిపురం, జూన్‌ 29: పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఫిరంగిపురంలోని మార్కెట్‌ యార్డులో బుధవారం వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం వైస్‌ జగన్‌ ప్రకటించిన మేనిఫోస్టు ఇప్పుడు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిందన్నారు.  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ గతంలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు వద్దకే పాలన తెచ్చిన ఘనత  సీఎం జగన్‌దేనన్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళిన కార్యకర్తలను వైసీపీ మరువ బోదన్నారు.  మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, గుంటూరు ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా, గుంటూరు మేయర్‌ మనోహర్‌ నాయుడు ప్రసంగించారు. ముందుగా ఫిరంగిపురంలోని సొలస సెంటర్‌లో గల వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత జేసీబీతో గజమాలను వేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మండలంలోని డ్వాక్రా మహిళలను వందలాదిగా ప్లీనరీకి తరలించారు. సభ జరిగేటప్పుడు ఎవ్వరూ బయటకు పోకుండా యార్డు గేట్లకు తాళాలు వేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నూతలపాటి హనుమయ్య, మార్పుల శివరామిరెడ్డి, పి.జేమ్స్‌, కె.చిన్నపరెడ్డి, చిట్టా అంజిరెడ్డి, పాలపాటి రఘు, బద్దూరి శ్రీనివాసరెడ్డి, ఎండ్రెడ్డి యల్లారెడ్డి, సయ్యద్‌ హబీబుల్లా, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:16:04+05:30 IST